
ఆర్జీయూకేటీ కెరీర్ గైడెన్స్
బాసర: బాసరలోని రాజీవ్‌గాంధీ యూనివర్సి టీ ఆఫ్ నాలెడ్జ్, టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ)లో ఇంజనీరింగ్ మూడు, నాలుగో సంవత్సరం విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ శుక్రవారం నిర్వహించారు. ఇంజినీరింగ్ తర్వాత భవిష్యత్ కార్యాచరణపై కళాశాల అధికారులు అవగాహ న కల్పించారు. గేట్/ఈఎస్‌ఈ/పీఎస్‌యూ కో చింగ్ గురించి ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ ఆధ్వర్యంలో విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. అకాడమీ ఫ్యాకల్టీ మోహన్‌త్రినాథ్ అవగాహన కల్పించారు. టైం మేనేజ్‌మెంట్, ప్రిపరేషన్ స్ట్రాటజీస్, సాఫ్ట్ స్కిల్స్, ప్రొఫెషనల్ ఎథిక్స్ గురించి వివరించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి వీసీ గోవర్ధన్, డీన్ ఆఫ్ అకడమిక్ అండ్ ప్లానింగ్ డాక్టర్ చంద్రశేఖర్, ట్రిపుల్‌ఈ హెచ్‌వోడీ భావసింగ్, స్టూడెంట్ కౌన్సిలర్ శ్రీనివాస్, కోఆర్డినేటర్ పవన్ తదితరులు పాల్గొన్నారు.