నిర్మల్‌ | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌

Jul 26 2025 8:19 AM | Updated on Jul 26 2025 9:04 AM

నిర్మ

నిర్మల్‌

రైతన్నా.. జర భద్రం
పురుగుమందులంటేనే అత్యంత ప్రమాదకరమైనవి. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో రైతులు, వ్యసాయ కూలీలు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
మళ్లీ కొత్త ఓటరు జాబితా!

శనివారం శ్రీ 26 శ్రీ జూలై శ్రీ 2025

8లోu

ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారిగా హరికిరణ్‌

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఉమ్మడి జిల్లాకు ప్రత్యేక అధికారిగా రాష్ట్ర ఎక్సైజ్‌ కమిషనర్‌ సి. హరికిరణ్‌ నియామకం అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి జిల్లా పరిధి ఆదిలాబాద్‌, నిర్మల్‌, కుమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాలకు ప్రత్యేక అధికారిగా ఆయా జిల్లా కలెక్టర్లతో పర్యవేక్షణ చేస్తూ ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు పని చేయనున్నారు. గతంలో ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారిగా ఇలంబర్తి పని చేయగా, ప్రస్తుతం ఆయన స్థానంలో హరికిరణ్‌ నియమితులయ్యారు.

నిర్మల్‌చైన్‌గేట్‌: గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఇందులో భాగంగా గ్రామం యూనిట్‌గా ఓటరు జాబితా తయారీకి పంచాయతీ అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే మండలస్థాయిలో ఓటరు జాబితా రూపొందించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇప్పుడు వార్డుల వారీగా గ్రామస్థాయిలో జాబితా రూపొందించనున్నారు. జిల్లాలో 2023 పార్లమెంట్‌ ఎన్నికల జాబితా ప్రకారం 4,50,045 మంది ఓటర్లు ఉన్నారు. ఈ కొత్త ప్రక్రియ గ్రామీణ ఎన్నికల పారదర్శకత, కచ్చితత్వాన్ని పెంచుతుంది.

కుటుంబ సభ్యుల ఓట్లు ఒకే వార్డులో..

గత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కుటుంబ సభ్యుల ఓట్లు వివిధ వార్డుల్లో చెల్లాచెదురుగా ఉండటంతో సమస్యలు తలెత్తాయి. ఈ సమస్యను నివారించేందుకు, ఈసారి కుటుంబ సభ్యుల ఓట్లన్నీ ఒకే వార్డులో ఉండేలా జాబితా తయారు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ చర్య ఓటర్లకు సౌలభ్యం కల్పించడంతోపాటు, ఎన్నికల ప్రక్రియలో గందరగోళాన్ని తగ్గించనుంది. గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఈ జాబితా తయారీ బాధ్యతను నిర్వహిస్తారు.

మార్పులు, చేర్పులకు అవకాశం..

జిల్లాలో 400 గ్రామ పంచాయతీలలో 4.50 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. కొత్తగా ఓటర్లుగా నమోదైనవారితోపాటు, కొందరు చనిపోయిన వారి పేర్లను తొలగించే ప్రక్రియ కూడా జరుగుతుంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యే వరకు ఓటరు నమోదు, మార్పులు, చేర్పులకు అవకాశం ఉంది. ఈ మార్పులన్నీ పరిగణనలోకి తీసుకుని, గ్రామస్థాయిలో కచ్చితమైన ఓటరు జాబితా సిద్ధం కానుంది.

‘పరిషత్‌’ ఎన్నికలకూ..

ప్రస్తుతం తయారు చేసే గ్రామస్థాయి ఓటరు జాబితా, రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ఉపయోగపడనుంది. ఈ జాబితా కచ్చితత్వం కోసం, గ్రామంలోని మొదటి వార్డు నుంచి చివరి వార్డు వరకు జాగ్రత్తగా రూపొందించనున్నారు. ఈ ప్రక్రియ ఎన్నికల్లో పారదర్శకతను పెంచుతుంది.

చించోలి(బి) గ్రామపంచాయతీ కార్యాలయం

సబ్‌స్టేషన్‌కు స్థల పరిశీలన

భైంసారూరల్‌: మండలంలోని మహాగాం గ్రామంలో నిర్మించే విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌కు అదనపు కలెక్టర్‌ కిశోర్‌కుమార్‌ శుక్రవారం స్థల పరిశీలన చేశారు. రైతులను కలిసి మాట్లాడారు. ఆయన వెంట ఆర్డీవో కోమల్‌రెడ్డి, తహసీల్దార్‌ ప్రవీణ్‌కుమార్‌ ఉన్నారు.

న్యూస్‌రీల్‌

దరఖాస్తుల ఆహ్వానం

నిర్మల్‌చైన్‌గేట్‌: జిల్లాలోని వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని జాతీయ ఆరోగ్య మిషన్‌లో భాగంగా పీఎం జన్‌మన్‌ పథకం కింద ఒప్పంద ప్రాతిపదికన మొబైల్‌ మెడికల్‌ యూనిట్‌లో వైద్య అధికారులు (01), ల్యాబ్‌ టెక్నీషియన్‌ (01), పారమేడిక్‌ –కం– అసిస్టెంట్‌ (01), స్టాఫ్‌ నర్స్‌ (01) పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ రాజేందర్‌ తెలిపారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు www.nirmal.telangana.gov.in వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్‌ చేసుకుని సంబంధిత అర్హత పత్రాలు జతచేసి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో అందించాలని తెలిపారు. దరఖాస్తు గడువు ఈ నెల 30వ తేదీ వరకు ఉన్నట్లు పేర్కొన్నారు.

జిల్లా వివరాలు..

మొత్తం మండలాలు 18

గ్రామపంచాయతీలు 400

వార్డుల సంఖ్య 3,368

ఎంపీటీసీ స్థానాలు 157

జెడ్పీటీసీ స్థానాలు 18

పోలింగ్‌ కేంద్రాలు 3,368

మొత్తం ఓటర్లు 4,50,045

మహిళా ఓటర్లు 2,35,775

పురుష ఓటర్లు 2,14,255

ఇతర ఓటర్లు 15

మండలస్థాయి నుంచి గ్రామస్థాయికి..

ఈ ఏడాది ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికల సన్నాహకంగా, ఎన్నికల కమిషన్‌ సూచనల మేరకు పంచాయతీరాజ్‌ శాఖ మండలాన్ని యూనిట్‌గా తీసుకుని ఓటరు జాబితాను సిద్ధం చేసింది. ఆయా గ్రామాల్లో వార్డుల వారీగా జాబితా రూపొందించి, ఎంపీడీవోలకు అందజేశారు. ఎంపీడీవోలు తమ లాగిన్‌ ద్వారా ఈ జాబితాను టీ–పోల్‌లో అప్‌లోడ్‌ చేశారు. అయితే, ఇప్పుడు గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని, వార్డుల వారీగా మరింత కచ్చితమైన జాబితా తయారీకి ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ జాబితాను గ్రామ పంచాయతీ కార్యదర్శులు సిద్ధం చేసి, ఎంపీడీవోల ద్వారా డీపీవోకు సమర్పిస్తారు.

నిర్మల్‌1
1/2

నిర్మల్‌

నిర్మల్‌2
2/2

నిర్మల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement