కురిసింది చినుకులే! | - | Sakshi
Sakshi News home page

కురిసింది చినుకులే!

Jul 25 2025 4:23 AM | Updated on Jul 25 2025 4:23 AM

కురిస

కురిసింది చినుకులే!

నిర్మల్‌

శ్రావణం.. శుభకరం..!

శ్రావణం.. శుభప్రదం.. అందుకే ఈ మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే ఈ మాసంలో అనేక పండుగలు రానున్నాయి.

శుక్రవారం శ్రీ 25 శ్రీ జూలై శ్రీ 2025

8లోu

28న వైద్యుల పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ

నిర్మల్‌చైన్‌గేట్‌: జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో ఒప్పంద ప్రాతిపాదికన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మూడు, బస్తీ దవాఖా నాలో రెండు వైద్యాధికారుల పోస్టుల భర్తీకి ఈనెల 28న ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు డీఎంహెచ్వో రాజేందర్‌ తెలిపారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికార కార్యాలయం, ఎఫ్‌–25, సమీకృత జిల్లా కార్యాలయాల స ముదాయంలో ఇంటర్వ్యూలు ఉంటాయని వెల్లడించారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు, దరఖాస్తును వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని తగిన అర్హత పత్రాలతో హాజరు కావాల ని పేర్కొన్నారు. వివరాలకు www.nirm al.telangana.gov.inను సందర్శించాలని సూ చించారు.

నిర్మల్‌: గత నివేదికలతో పోలిస్తే.. జిల్లాలో ప్రస్తుత వానాకాలం సీజన్‌లో సాధారణ వర్షపాతం కూడా నమోదు కాలేదు. ఇప్పటిదాకా జిల్లా మొత్తం భారీ వర్షాలు కురిసిన దాఖలాలు లేవు. స్వర్ణ, గడ్డెన్నవాగు ప్రాజెక్టుల్లోకి కనీస ఇన్‌ఫ్లో లేదు. ప్రతీ సీజన్‌లో జులై చివరలో, ఆగస్టు మొదట్లోనే జిల్లాలో భారీవర్షాలు కురుస్తున్నాయి. గత నాలుగైదేళ్లుగా ఈ రెండుమూడు వారాల్లోనే నమోదవుతున్నాయి. దాదా పు 2021నుంచీ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఈ నెల 26 వరకు జిల్లాలోనూ భారీ వర్షాలు కురిసే అ వకాశం ఉందని వాతారవణ శాఖ అంచనా వేసింది.

కురిసే కాలమిదే..

గత ఏడాది మినహా 2021నుంచి వరుసగా జిల్లాలో జులై రెండోవారం నుంచి ఆగస్టు మొదటివారం మధ్యలోనే భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి.

● 2021లో జులై 22, 23 తేదీల్లో జిల్లా వర్షబీభత్సాన్ని చవిచూసింది. దాదాపు 190–200 మి.మీల. వర్షపాతం నమోదైంది. ఎగువన మహారాష్ట్రలో నూ భారీ వర్షాలు కురవడంతో స్వర్ణ, గడ్డెన్నవా గులు ఉప్పొంగాయి. జిల్లా కేంద్రంలోని జీఎన్‌ఆర్‌కాలనీని వరద ముంచెత్తింది. భైంసాలోని సుద్ధవాగు శివారు కాలనీలన్నీ జలమయమయ్యాయి.

● 2022లోనూ జులైలోనే భారీ వర్షాలు నమోదయ్యాయి. ఆ ఏడాది జులై 13న కడెం.. గుండెదడ పెట్టించింది. ఏకంగా నాలుగైదు లక్షల క్యూసెక్కులతో ప్రాజెక్టుపై నుంచి మహావరద ఉప్పొంగింది.

● 2023లోనూ జూలై నెలలో భారీ వర్షపాతం నమోదైంది. జులై 26న మరోసారి కడెం ప్రాజెక్టును భారీవరద ముంచెత్తింది. జిల్లా కేంద్రంలోని జీఎన్‌ఆర్‌ కాలనీ ముంపునకు గురైంది.

● 2024లో మాత్రం ఆగస్టు చివరివారం, సెప్టెంబర్‌ రెండోవారం వరకూ వర్షాలు సమృద్ధిగా కురిశాయి. గతేడాది సాధారణ వర్షపాతం 1060.7మి.మీ కాగా, ఏకంగా 1297.5 మి.మీ వర్షపాతం నమోదైంది.

ఇన్‌ఫ్లోనే లేదు..

జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులైన కడెం, గడ్డెన్నవాగు, స్వర్ణ ఈ మూడు నిండాలంటే స్థానికంగా కురిసే వ ర్షాలు సరిపోవు. ఎగువన ఉన్న మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిస్తేనే ఈ మూడింటిలోకి వరద వస్తుంది. ఇప్పటి వరకు జిల్లాతోపాటు పైన ఉన్న మహా రాష్ట్రలోనూ భారీవర్షాలు కురవలేదు. ఆదిలాబాద్‌ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు కడెం ప్రాజెక్టులోకి రెండు మూడు రోజులుగా నాలుగైదు వేల క్యూసెక్కుల వరద వస్తోంది. కానీ.. స్వర్ణ, గడ్డెన్నవాగు ప్రాజెక్టుల్లోకి కనీస ఇన్‌ఫ్లో లేకపోవడం గమనార్హం. ఈనెలాఖరు, వచ్చేనెల మొదటివారంలోపు సమృద్ధిగా వర్షాలు కురిస్తేనే ఖరీఫ్‌ సాగు లాభసాటిగా ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

నిర్మల్‌చైన్‌గేట్‌: జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నదులు, వాగుల పరీవా హక ప్రాంతాల్లో నివసించే ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ ప్రజలకు సూచించారు. ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా సంబంధిత శాఖల అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండి పర్యవేక్షణ చేపట్టాలన్నారు. భారీ వర్షాలతో ఎక్కడైనా ప్రమాదం జరిగినా లేక సాయం అవసరమైనా నూతనంగా ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌ 91005 77132 ను సంప్రదించాలని తెలిపారు.

విద్యార్థులకు పోటీలు నిర్వహించాలి

డీఈవో రామారావు

నిర్మల్‌ రూరల్‌: కేంద్ర విద్యాశాఖ ఆదేశాల ప్రకారం జిల్లాలోని యూడైస్‌ కలిగిన అన్ని పాఠశాలల్లో పొగాకు రహిత సమాజంపై విద్యార్థులకు పోటీలను నిర్వహించి ఈనెల 31లోపు ఆన్‌లైన్‌లో వివరాలు అప్‌లోడ్‌ చే యాలని డీఈవో రామారావు సూచించారు. ఈనెల 25న పోస్టర్‌ మేకింగ్‌, 26న స్లొగన్స్‌/ పద్యాలు, 28న ర్యాలీ, 29 వీధి నాటకం అనే నాలుగు అంశాలలో కార్యక్రమాలు నిర్వహించి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని వివరించా రు. దీనికి సంబంధించిన సమాచారం పోర్టల్‌లో అందుబాటులో ఉందని తెలిపారు. పొగా కు వాడడంతో కలిగే అనర్థాలు, వ్యాధుల గు రించి ఉపాధ్యాయులు వివరించి, విద్యార్థుల్లో అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. వారి ద్వారా తల్లిదండ్రులకు సమాజానికి అ వగాహన కల్పించే ఏర్పాట్లు చేయాలని సూ చించారు. పోటీ నిర్వహించిన ఫొటోలు వీడియోలు https://innovateindia.myg ov.in అనే వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని తెలిపారు.

సామగ్రి సిద్ధం చేస్తున్న

అధికార యంత్రాంగం

ఇప్పటికే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ స్థానాల ఖరారు

బీసీ రిజర్వేషన్‌కు ఆమోదం రాగానే షెడ్యూల్‌ ప్రకటన

మొదలైన పంచాయతీ, పరిషత్‌ ఎన్నికల సందడి

న్యూస్‌రీల్‌

‘గడ్డెన్న’కు స్వల్ప ఇన్‌ఫ్లో

భైంసాటౌన్‌: ఎగువన కురిసిన వర్షాలకు పట్టణంలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టుకు గురువా రం స్వల్ప(324 క్యూసెక్కులు) ఇన్‌ఫ్లో వచ్చి చేరినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 358.70 మీటర్లు కాగా, ప్రస్తుతం 355.80 మీటర్ల నీరు ఉంది. ప్రాజెక్టు సామర్థ్యం 1.83 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 0.540 టీఎంసీలు మాత్రమే నీరు నిల్వ ఉంది. ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో ప్రాజెక్టులోకి పూర్తిస్థాయిలో నీరు చేరలేదు.

గతేడాది కురిసింది 493.6

సాధారణం కన్నా తక్కువ..

ఈ సీజన్‌లో జూన్‌, జులై నెలల్లో సాధారణంగా 404 మి.మీల వర్షపాతం నమోదు కావా ల్సి ఉండగా, ఇప్పటి వరకు కేవలం 288.7మి.మీలు మాత్రమే కురిసింది. గతేడాది ఇదే సమయానికి ఏకంగా 493.6మి.మీ వర్షపాతం నమోదైంది. వర్షాకాలం ఆరంభంలో ఓ మోస్తరు వానలు కురవడంతో రైతులు హర్షం వ్యక్తంచేశారు. కానీ.. ఆతర్వాత నుంచి సరైన వర్షం లేక ఆకాశంవైపు చూడాల్సి వచ్చింది. రెండు రోజుల నుంచి ఓ మోస్తరు కురుస్తున్నా.. ఇప్పటికీ సరైన భారీ వర్షం పడకపోవడంతో రానున్న రోజుల్లో పంటలకు నీరెలా అని రైతులు కలవర పడుతున్నారు.

డిగ్రీలో ప్రత్యేక అడ్మిషన్లు

భైంసాటౌన్‌: డిగ్రీలో ప్రవేశాలకు తెలంగాణ ఉన్నత విద్యామండలి దోస్త్‌ ప్రత్యేక నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు భైంసా జీఆర్‌పీ ప్రభుత్వ డిగ్రీ కశాశాల ప్రిన్సిపాల్‌ కె.బుచ్చ య్య తెలిపారు. రూ.400 రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించి ప్రత్యేక అడ్మిషన్‌ కోసం ఈనెల 25 నుంచి 31 వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవడంతోపాటు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించారు. 31న ప్రత్యేక కేటగిరీ (పీహెచ్‌/సీఏపీ/ఎన్‌సీసీ/క్రీడలు,అదనపు పాఠ్యాంశాలు)విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని పేర్కొన్నారు. ఆగస్టు 3న సీట్ల కేటాయింపు, 6 వరకు కళాశాలల్లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌, 11, 12 తేదీల్లో స్పాట్‌ అడ్మిషన్లు ఉంటాయని వివరించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ సీజన్‌లో ఇప్పటివరకు

వర్షపాతం(మిల్లీమీటర్లలో)..

ఇప్పటికీ నమోదు కాని భారీ వర్షాలు

ఖరీఫ్‌కు ఈ 20 రోజులే కీలకం..

జిల్లాల్లో నాలుగేళ్లుగా వర్షబీభత్సం

ఈసారీ భారీ వర్షాలకు అవకాశం

వర్ష సూచన..

ఈనెల 23 నుంచి 26 వరకు నిర్మల్‌ జిల్లాలోనూ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కేంద్ర వాతావరణశాఖ అంచనా వేసింది. జిల్లాలో బుధవారం రాత్రి కొన్నిప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఆ తర్వాత నుంచి అడపాదడపా చినుకులు పడుతున్నాయే తప్పా భారీ వర్షం కురవడం లేదు. వాతావరణం మబ్బుపట్టి ఉండటంతో శుక్ర, శనివారాల్లో భారీ వర్షపాతం నమోదవుతుందేమోనని ఆశిస్తున్నారు. ఒకవేళ అతిభారీ వర్షాలు కురిస్తే అందుకు తగ్గట్లుగా జిల్లాయంత్రాంగం సిద్ధంగా ఉంది. గత అనుభవాల నేపథ్యంలో కలెక్టర్‌, ఎస్పీ, సంబంధిత అధికారులు ముందుజాగ్రత్తలు తీసుకున్నారు. కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటుతోపాటు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలనూ అందుబాటులో ఉంచారు.

కురిసింది చినుకులే!1
1/2

కురిసింది చినుకులే!

కురిసింది చినుకులే!2
2/2

కురిసింది చినుకులే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement