
చట్టాలపై అవగాహన ఉండాలి
● జడ్జి రాధిక
కుభీర్: ప్రతి ఒక్కరికీ చట్టాలపై అవగాహన ఉండాలని జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి రాధిక అన్నారు. మండలంలోని సాయినగర్(దొడర్నా)లో గురువారం న్యాయసేవా సదస్సు జరిగింది. రాధిక ముఖ్య అతి థిగా హాజరై మాట్లాడారు. చట్టాలు తెలిసి ఉంటే నేరాలు తగ్గుతాయని అన్నారు. మహిళలకు ఏవైనా సమస్యలు ఉంటే సఖీ కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు. గిరిజన రైతులు నాసిరకమైన విత్తనా లు కొనుగోలు చేసి మోసపోవద్దన్నారు. జిల్లాలో 18 గిరిజన ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయని వాట న్నింటిని పరిశీలించి ఐటీడీఏ పీవో ఖుష్బూగుప్తాకు రిపోర్ట్ చేస్తానని తెలిపారు. ప్రతి ఒక్కరికీ విద్య, వైద్యంతోపాటు సంక్షేమ పథకాలు అందాలన్నారు. అనంతరం దొడర్నా ఆశ్రమ పాఠశాలను పరిశీలించి ఉపాధ్యాయులతో సమావేశమై పాఠశాల వివరా లు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ శివరాజ్, ఎంపీడీవో సాగర్‌రెడ్డి, ఏవో సారిక, ప్రభుత్వ వైద్యుడు రాథోడ్ విజయ్, ఎస్సై కృష్ణారెడ్డి, సఖీకేంద్రం ప్రతినిధి స్వేతారాణి, ఏఈవో జగదీశ్, ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపల్ చంద్రశేఖర్, రైతులు, గిరిజన మహిళలు పాల్గొన్నారు.