‘పీఎం జన్‌మన్‌’ వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

‘పీఎం జన్‌మన్‌’ వేగవంతం చేయాలి

Jul 25 2025 4:23 AM | Updated on Jul 25 2025 4:23 AM

‘పీఎం జన్‌మన్‌’ వేగవంతం చేయాలి

‘పీఎం జన్‌మన్‌’ వేగవంతం చేయాలి

కేంద్ర గిరిజన వ్యవహారాల కార్యదర్శి విభూనాయర్‌

నిర్మల్‌చైన్‌గేట్‌: పీఎం జన్‌మన్‌(ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహాభియాన్‌) కార్యక్రమాన్ని వేగంగా పూర్తిచేయాలని కేంద్ర గిరిజన వ్యవహా రాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి విభూనాయర్‌ కలెక్టర్లకు సూచించారు. ఢిల్లీ నుంచి గురువారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. గిరిజనుల సమగ్ర అభివృద్ధికి అవసరమైన ఆధార్‌ నమోదు, జన్‌ధన్‌ ఖాతాలు, పక్కా ఇళ్లు, పీఎం కిసాన్‌, కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు వంటి పథకాలను విజయవంతంగా అమలు చేయాలని వివరించారు. కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షణ చేయాలన్నారు. ఆది కర్మయోగి కా ర్యక్రమాన్ని క్రమబద్ధంగా అమలు చేయాలని సూచించారు. జిల్లాల్లో చేపడుతున్న మౌలిక వసతు లు, స్థల సేకరణపై కలెక్టర్లను అడిగి తెలుసుకున్నా రు. అనంతరం కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ మాట్లాడు తూ పీఎం జన్‌మన్‌ కింద చేపట్టాల్సిన అన్ని పనులు గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనుమతి లభించిన గ్రామాల్లో అర్హు ల గుర్తింపు కోసం పంచాయతీ కార్యదర్శులు సర్వే నిర్వహించాలని, సేకరించిన సమాచారం యాప్‌లో నమోదు చేస్తున్నామన్నారు. జిల్లాలోని 24 హాబిటేషన్లలో 771 పక్కా గృహాలు నిర్మించనున్నట్లు తెలి పారు. అంగన్‌వాడీలు, వసతి గృహాలు, ప్రైమరీ పాఠశాలలు, రోడ్డు కనెక్టివిటీ, మల్టీపర్పస్‌ సెంటర్లు నిర్మించేందుకు అవసరమైన చర్యలు చేపట్టనున్న ట్లు వివరించారు. అదనపు కలెక్టర్‌ ఫైజాన్‌ అహ్మద్‌, ఆర్డీవో రత్నకళ్యాణి, డీపీవో శ్రీని వాస్‌, హౌసింగ్‌ పీడీ రాజేశ్వర్‌, వ్యవసాయ శాఖ అధికారి అంజిప్రసాద్‌, ఎల్డీఎం రామ్‌గోపాల్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ సందీప్‌, ఎంపీడీవోలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement