కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయించాలి
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయించాలని డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావు ఆధ్వర్యంలో కలెక్టర్ అభిలాష అభినవ్‌కు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి ఎకరం స్థలం కేటాయించాలన్నారు. వినతిపత్రం ఇచ్చినవారిలో నిర్మల్ సీఏసీఎస్ చైర్మన్ సోమా భీమ్‌రెడ్డి, సారంగాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ హాది, నిర్మల్ పట్టణ అధ్యక్షుడు నందెడపు చిన్ను, మండల అధ్యక్షులు భుజంగా శ్రీనివాస్‌రెడ్డి, ఓడ్నాల రాజేశ్వర్, గడ్డం ఇంద్రకరణ్‌రెడ్డి, బొల్లోజి నర్సయ్య, ఏనుగు లింగారెడ్డి, కొర్వ నవీన్, ఈటల శ్రీనివాస్, కొండ శ్రీనివాస్, గాజుల రవి కుమార్ ఉన్నారు.


