ఇచ్చోడ: సర్కారు దవాఖానాకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలందించాలని డీఎంహెచ్‌వో నరేందర్ రాథో డ్ అన్నారు. గురువారం ఇచ్చోడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. పలు రికార్డులు పరిశీ లించి సిబ్బందితో మాట్లాడారు. ఆస్పత్రికి వచ్చే గర్భిణులు, బాలింతలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. రోగులకు అందించే వైద్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాత్రివేళలో వచ్చే రోగుల పట్ల వెంటనే స్పందించాలన్నారు. ఆరోగ్య కేంద్రాల ద్వాదా 24 గంటల పాటు వైద్యం అందించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment