
కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్
● జిల్లా ఎన్నికలాధికారి ఆశిష్ సాంగ్వాన్
నిర్మల్‌చైన్‌గేట్: కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా ఎన్నికలాధికారి, కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. బుధవారం పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్, స్ట్రాంగ్ రూమ్ కేంద్రాలను అ దనపు కలెక్టర్ కిశోర్‌కుమార్‌తో కలిసి పరిశీలించారు. బారికేడ్లు, పార్కింగ్ సదుపాయం క ల్పించాలని సూచించారు. భద్రతాపరమైన అంశాలు పరిశీలించి పలు సూచనలు చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని, అవసరమైన చోట సీసీ కెమెరాలు, లై టింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. అవసరమైన చోట తక్షణమే మరమ్మతు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయన వెంట ప్రిన్సి పాల్, ఆర్‌అండ్‌బీ అధికారి అశోక్, సుదర్శన్, సిబ్బంది ఉన్నారు.
పోస్టల్ బ్యాలెట్‌కు
1,630 దరఖాస్తులు
భైంసాటౌన్: ఎన్నికల విధులు నిర్వర్తించనున్న 1,630 మంది ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ కోసం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. బుధవారం దరఖా స్తు గడువు ముగిసినట్లు పేర్కొన్నారు. అలాగే ఇంటి నుంచి ఓటు వేసేందుకుగాను దివ్యాంగులు, 80 ఏళ్లపైబడిన వృద్ధులు 224 దరఖాస్తులు అందజేసినట్లు తెలిపారు.
ముధోల్ నామినేషన్
కేంద్రం పరిశీలన
ముధోల్: మండల కేంద్రంలోని తహసీల్ కా ర్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని బుధవారం ఎన్నికల జనరల్ అబ్జర్వర్ రవిరంజన్ కుమార్ విక్రం పరిశీలించారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి కోమల్‌రెడ్డితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.