‘ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయి’ | YSRCP MP Gurumurthy Slams On AP Govt | Sakshi
Sakshi News home page

‘ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయి’

Jun 13 2025 5:52 PM | Updated on Jun 14 2025 10:21 AM

YSRCP MP Gurumurthy Slams On AP Govt

ఢిల్లీ:  ఏపీలో శాంతి భద్రతలు దిగజారిపోయాయన్నారు వైఎస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తి.  ఇందుకు అనంతపురం జిల్లాలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులపై టీడీపీ నేతల అత్యాచారానికి పాల్పడిన ఘటనలే ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశామని, అత్యాచారానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. 

‘అత్యాచారానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాము. హరికృష్ణ పై దాడికి సంబంధించి జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించి నివేదిక పంపాలని ఏపీ ప్రభుత్వానికి  ఆదేశాలు ఇచ్చింది. బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. సాక్షి మీడియాను నిర్వీర్యం చేసేందుకు, ఏపీ ప్రభుత్వం  కక్షపూరితంగా వ్యవహరించారు. కొమ్మినేని శ్రీనివాస్ పై ఏపీ ప్రభుత్వం అక్రమంగా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టింది. విశ్లేషకుడు చెప్పిన వ్యాఖ్యలకు కొమ్మినేనికి ఆపాదించడం సరికాదు   కొమ్మినేనిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇది శుభపరిణామం’ అని ఎంపీ గురుమూర్తి వ్యాఖ్యానించారు.

ఏపీలో మహిళలపై తీవ్రమైన అఘాయిత్యాలు
ఏపీలో మహిళలపై తీవ్రమైన అఘాయిత్యాలు జరుగుతున్నాయని అరకు ఎంపీ తనుజారాణి పేర్కొన్నారు. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలలో చిన్న చిన్న బాలికలపై అత్యాచారాలు జరిగాయన్నారు. దీనిపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశామని, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఎంపీ తనుజా రాణి తెలిపారు. వైఎస్సార్‌సీపీ నేతలను ఏపీ పోలీసులు టార్గెట్‌ చేస్తున్నారని, చిత్రహింసలకు గురిచేస్తున్నారన్నారు.

ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయి

Advertisement
 
Advertisement
Advertisement