ఇల్లు కూలితే పట్టదా?

Women Suicide Attempt In Front Of Pralhad Joshi House - Sakshi

సాక్షి, హుబ్లీ: కూలిపోయిన ఇంటికి పరిహారం కోసం తిరిగి తిరిగి వేసారిన ఓ మహిళ స్థానిక ఎంపీ, కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి ఇంటి ఎదుట డెత్‌నోట్‌ రాసి పెట్టి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన కర్ణాటకలోని ధార్వాడలో బుధవారం చోటుచేసుకుంది. ధార్వాడ తాలూకా గరగ గ్రామానికి చెందిన శ్రీదేవి అనే మహిళకు చెందిన ఇల్లు గత ఏడాది వర్షాకాలంలో అతివృష్టితో కూలిపోయింది.

పరిహారం ఇప్పించి ఆదుకోవాలని కొన్ని నెలలుగా ధార్వాడ గ్రామీణ ఎమ్మెల్యే అమృత్‌ దేశాయిని కలిసి విజ్ఞప్తులు చేసింది. ఆయన ఎంపీకి విజ్ఞప్తి చేయాలని సూచించారు. ఆమె ధార్వాడ ఎంపీ, కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి ఇంటికి వెళ్లి పరిహారం కోసం మొర పెట్టుకున్నా ఫలితం లేకపోయింది. విసిగి వేసారిన శ్రీదేవి ఆయన ఇంటి ఎదుట లేఖ రాసి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తీవ్ర అస్వస్థతకు పాలైన ఆమెను విమ్స్‌ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. 

చదవండి: వేట కొడవళ్లతో దాడి: తండ్రీ కొడుకుల దారుణ హత్య

పెళ్లయిన 43వ రోజు భార్య గొంతు కోసి దారుణ హత్య 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top