గెటప్‌ వెనుక కథ ఏమిటో! | Will DK Shivakumar Finally Shave His Trademark Beard After Becoming CM? Beard Story Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

గెటప్‌ వెనుక కథ ఏమిటో!

May 31 2026 7:48 AM | Updated on May 31 2026 12:37 PM

Will DKS finally shave his trademark beard?

సీఎం అయ్యాక గడ్డం తీసేస్తారా? 

కర్ణాటక: డీకే శివకుమార్‌ మామూలుగా గడ్డం అనేది లేకుండా ఉండేవారు. కానీ ఈడీ, సీబీఐ కేసుల్లో అరెస్టయి తీహార్‌ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఈ సమయంలో ఆయన ప్రతిజ్ఞ పూని గడ్డం విడిచారు. తీహార్‌ జైలు నుంచి బయటికి వచ్చిన తరువాత గడ్డం గెటప్‌ అలాగే కొనసాగుతోంది. ఈ మార్పు గురించి విలేకరుల సమావేశాల్లో ప్రశ్నించినా డీకే శివకుమార్‌ సమాధానం చెప్పేవారు కాదు. గడ్డం వెనుక రహస్యం ‘సీఎం కుర్చీయే’ అని చర్చ జరుగుతుండేది. 

ఆయన త్వరలోనే షేవ్‌ చేసుకుంటారని, సెలూన్‌ వారి ద్వారా ఈ సమాచారం తెలిసిందని బీజేపీ పక్ష నేత అశోక్‌ అసెంబ్లీలోనూ చెప్పారు. గడ్డం పెంచడం వెనుక  ప్రతిజ్ఞ  ఏమిటని కూడా ప్రశ్నించారు. అజ్జయ్య స్వామి చెప్పినపుడు గడ్డం తీస్తారు అని మంత్రి కృష్ణ బైరేగౌడ సరదాగా సమాధానమిచ్చారు. ఇప్పుడు ముఖ్యమంత్రి కాబోతున్నారు కాబట్టి గడ్డం తీసేస్తారా?, ప్రమాణ స్వీకారోత్సవంలో కొత్త  కొత్త లుక్‌లో కనిపిస్తారా అనేది కుతూహలంగా ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement