
పిల్లలు, భర్తను విడిచి పరారైన మహిళ
బెంగళూరు: భర్త, ముగ్గురు పిల్లలను వదిలి మహిళ ఒకరు తన ప్రియుడితో కలిసి పారిపోయిన ఘటన బెంగళూరు నగర జిల్లా పరిధిలోని ఆనేకల్ తాలూకాలోని బన్నేరుఘట్ట సమీపంలో ఉన్న బసవనపుర గ్రామంలో గత నెల 31వ తేదీన జరిగింది. మహిళ తన ప్రియుడితో వెళ్లిపోవడంతో తల్లి లేక ముగ్గురు పిల్లలు, భార్య పోయిన బాధలో భర్త కన్నీరుమున్నీరవుతున్నారు.
మంజునాథ్, లీలావతి దంపతులు 11 ఏళ్ల క్రితం పరస్పరం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరి కుటుంబంలోకి సంతోష్ అనే వ్యక్తి చొరబడి చిచ్చురేపాడు. లీలావతి సంతోష్‌తో వివాహేతర సంబంధం పెట్టుకొని గత నెల 31వ తేదీన ఇంటిలో నుంచి వెళ్లిపోయింది. లీలావతి భర్త మంజునాథ్ బన్నేరుఘట్ట పోలీసులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భార్యను తనకు అప్పగించాలని భోరున విలపిస్తున్నాడు.
పిల్లలను చూసుకునేవారు లేరు
ముగ్గురు పిల్లలు కూడా చిన్నవారని, వారిని చూసుకునే వారు ఎవరూ లేరని, తన భార్య తనకు కావాలని మంజునాథ్ బోరుమంటున్నాడు. లీలావతి వెళ్లిపోయి ఆరు రోజులైనా పిల్లలకు ఒక ఫోన్ కూడా చేయలేదు. దీంతో తమకు అమ్మ కావాలని చిన్నారులు విలపిస్తున్నారు.