అబ్బాస్‌ ఎవరు? వాద్‌నగర్‌లో మోదీతో పాటు ఎందుకున్నారు? | Who Is Abbas Ramsada Grew Up With Modi, Know About Interesting Story Behind Their Bonding In Telugu | Sakshi
Sakshi News home page

Abbas Ramsada Story: అబ్బాస్‌ ఎవరు? వాద్‌నగర్‌లో మోదీతో పాటు ఎందుకున్నారు?

Sep 18 2025 1:29 PM | Updated on Sep 18 2025 5:09 PM

Who is Abbas Ramsada Grew up With Modi

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజు వేడుకలను భారతీయ జనతా పార్టీ 15 రోజుల పాటు నిర్వహిస్తోంది. ఈ పక్షం రోజుల్లో దేశంలోని వివిధ ప్రాంతాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోంది. ఈ నేపధ్యంలో ప్రధాని మోదీ జీవితంలోని పలు ఆసక్తికర విషయాలు తెరపైకి వస్తున్నాయి. అటువంటి వాటిలో ఒకటే ప్రధాని మోదీ బాల్య స్నేహితుడు అబ్బాస్‌ రామ్‌సదా వృత్తాంతం. అతను చిన్నతనంలో మోదీ కుటుంబంతో కలిసి వాద్‌నగర్‌లో ఉన్నారు.

2022లో ప్రధాని నరేంద్ర మోదీ తన తల్లి హీరా బెన్ పుట్టినరోజు సందర్భంగా గుజరాత్‌లోని వాద్‌నగర్‌లోని తన ఇంటికి వెళ్లారు.  అ‍ప్పుడు ప్రధాని మోదీ బ్లాగ్‌లో తన తల్లి హీరాబెన్‌ పోరాట కథను చెప్పారు. ఈ బ్లాగ్‌లో అబ్బాస్ అనే ముస్లిం స్నేహితుని గురించి ప్రస్తావించారు.  తన తండ్రి స్నేహితుడొకరు చనిపోవడంతో అతని కుమారుడు  అబ్బాస్‌ను ఇంటికి తీసుకొచ్చారని మోదీ గుర్తు చేసుకున్నారు. అతను తమ దగ్గరే ఉంటూ చదువు పూర్తి చేశాడని, అన్నదమ్ములందరినీ అమ్మ ఎలా చూసుకునేదో అబ్బాస్ ని కూడా అలాగే చూసుకునేదన్నారు. ప్రతి సంవత్సరం ఈద్ రోజున అబ్బాస్ కోసం అతనికి ఇష్టమైన ప్రత్యేక వంటకాలు వండేవారని తెలిపారు.

అబ్బాస్..  మోదీ కుటుంబంలోనే ఉంటూ మోదీ సోదరుడు పంకజ్ మోడీతో కలిసి ఒకే తరగతిలో చదువుకున్నారు. 1973-74లో అబ్బాస్ తన మెట్రిక్యులేషన్ పరీక్షలలో అద్భుతమైన గ్రేడ్‌ సాధించారని ది టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక పేర్కొంది. అయితే అబ్బాస్ తన మెట్రిక్యులేషన్‌ పరీక్షకు హాజరయ్యే సమయానికి, మోదీ.. వాద్‌నగర్ నుండి అహ్మదాబాద్‌కు ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌గా వెళ్లిపోయారు. ప్రధాని సోదరుడు పంకజ్ మోదీ , అబ్బాస్  ప్రభుత్వ ఉద్యోగాలు పొందారు. ప్రధాని మోదీ సోదరులలో మరొకరైన ప్రహ్లాద్ మోదీ ఒకసారి అబ్బాస్ తమ ఇంట్లో ఉన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు.

2022లో అబ్బాస్ ప్రభుత్వ  ఉద్యోగం నుండి పదవీ విరమణ చేసి, తన చిన్న కుమారునితో పాటు ఆస్ట్రేలియాలోని సిడ్నీకి వెళ్లారు. అబ్బాస్‌ పెద్ద కుమారుడు ఇప్పటికీ గుజరాత్‌లోని మెహ్సానాలో నివసిస్తున్నారు. ప్రధాని మోదీపై  అబ్బాస్‌ రాసిన పుస్తకంలో.. తనకు మోదీ కుటుంబం సుంచి లభించిన మద్దతు, ఆప్యాయత మరువలేనిదన్నారు. ముఖ్యంగా హీరాబెన్  ఎంతో ప్రేమ చూపేవారన్నారు. ఆమె తన సొంత పిల్లల కంటే తనను ఎక్కువగా చూసుకున్నారని  ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement