breaking news
Vadnagar
-
అబ్బాస్ ఎవరు? వాద్నగర్లో మోదీతో పాటు ఎందుకున్నారు?
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజు వేడుకలను భారతీయ జనతా పార్టీ 15 రోజుల పాటు నిర్వహిస్తోంది. ఈ పక్షం రోజుల్లో దేశంలోని వివిధ ప్రాంతాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోంది. ఈ నేపధ్యంలో ప్రధాని మోదీ జీవితంలోని పలు ఆసక్తికర విషయాలు తెరపైకి వస్తున్నాయి. అటువంటి వాటిలో ఒకటే ప్రధాని మోదీ బాల్య స్నేహితుడు అబ్బాస్ రామ్సదా వృత్తాంతం. అతను చిన్నతనంలో మోదీ కుటుంబంతో కలిసి వాద్నగర్లో ఉన్నారు.2022లో ప్రధాని నరేంద్ర మోదీ తన తల్లి హీరా బెన్ పుట్టినరోజు సందర్భంగా గుజరాత్‌లోని వాద్‌నగర్‌లోని తన ఇంటికి వెళ్లారు. అప్పుడు ప్రధాని మోదీ బ్లాగ్‌లో తన తల్లి హీరాబెన్ పోరాట కథను చెప్పారు. ఈ బ్లాగ్‌లో అబ్బాస్ అనే ముస్లిం స్నేహితుని గురించి ప్రస్తావించారు. తన తండ్రి స్నేహితుడొకరు చనిపోవడంతో అతని కుమారుడు అబ్బాస్‌ను ఇంటికి తీసుకొచ్చారని మోదీ గుర్తు చేసుకున్నారు. అతను తమ దగ్గరే ఉంటూ చదువు పూర్తి చేశాడని, అన్నదమ్ములందరినీ అమ్మ ఎలా చూసుకునేదో అబ్బాస్ ని కూడా అలాగే చూసుకునేదన్నారు. ప్రతి సంవత్సరం ఈద్ రోజున అబ్బాస్ కోసం అతనికి ఇష్టమైన ప్రత్యేక వంటకాలు వండేవారని తెలిపారు.అబ్బాస్.. మోదీ కుటుంబంలోనే ఉంటూ మోదీ సోదరుడు పంకజ్ మోడీతో కలిసి ఒకే తరగతిలో చదువుకున్నారు. 1973-74లో అబ్బాస్ తన మెట్రిక్యులేషన్ పరీక్షలలో అద్భుతమైన గ్రేడ్ సాధించారని ది టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక పేర్కొంది. అయితే అబ్బాస్ తన మెట్రిక్యులేషన్ పరీక్షకు హాజరయ్యే సమయానికి, మోదీ.. వాద్నగర్ నుండి అహ్మదాబాద్‌కు ఆర్ఎస్ఎస్ ప్రచారక్‌గా వెళ్లిపోయారు. ప్రధాని సోదరుడు పంకజ్ మోదీ , అబ్బాస్ ప్రభుత్వ ఉద్యోగాలు పొందారు. ప్రధాని మోదీ సోదరులలో మరొకరైన ప్రహ్లాద్ మోదీ ఒకసారి అబ్బాస్ తమ ఇంట్లో ఉన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు.2022లో అబ్బాస్ ప్రభుత్వ ఉద్యోగం నుండి పదవీ విరమణ చేసి, తన చిన్న కుమారునితో పాటు ఆస్ట్రేలియాలోని సిడ్నీకి వెళ్లారు. అబ్బాస్ పెద్ద కుమారుడు ఇప్పటికీ గుజరాత్‌లోని మెహ్సానాలో నివసిస్తున్నారు. ప్రధాని మోదీపై అబ్బాస్ రాసిన పుస్తకంలో.. తనకు మోదీ కుటుంబం సుంచి లభించిన మద్దతు, ఆప్యాయత మరువలేనిదన్నారు. ముఖ్యంగా హీరాబెన్ ఎంతో ప్రేమ చూపేవారన్నారు. ఆమె తన సొంత పిల్లల కంటే తనను ఎక్కువగా చూసుకున్నారని ఆయన పేర్కొన్నారు. -
సొంతూరులో మోదీకి ఎదురుదెబ్బ.. కాంగ్రెస్ రెపరెపలు!
అహ్మదాబాద్: గుజరాత్లో తనకు తిరుగులేదని మరోసారి బీజేపీ నిరూపించుకున్నా.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత నియోజకవర్గంలో మాత్రం ఓటమిపాలైంది. ప్రధాని మోదీ సొంతూరు వాద్నగర్ ఉన్న ఉన్జా నియోజకవర్గంలో కమలం ఓటమిపాలైంది. బీజేపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే పటేల్ నారాయణ్‌భాయ్ లల్లూదాస్‌ను కాంగ్రెస్ అభ్యర్థి ఆశా పటేల్ సుమారు 19,500 ఓట్ల మెజారిటితో ఓడించారు. పటీదార్ (పటేల్) సామాజికవర్గం ప్రాబల్యం అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఆశా పటేల్‌కు 81,797 ఓట్లు రాగా, ఆమె ప్రత్యర్థి లల్లూదాస్కు 62,268 ఓట్లు వచ్చాయి. 2012లో లల్లూదాస్ 25వేల ఓట్ల మెజారిటీతో ఆశాపటేల్పై విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఉన్జా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి.. ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మోదీ సొంతూరు వాద్‌నగర్‌కు సమీపంలోని ఉమియా మాతా ఆలయాన్ని దర్శించుకున్నారు. ఇక్కడి ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఎన్నికలకు కొన్నివారాలముందే ప్రముఖ పుణ్యక్షేత్రం హరిద్వార్‌లో ఉమియా ధామ్ ఆశ్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు.