వాహ‌నంలో పెట్రోల్ ఉద‌యం పోయించాలా? రాత్రి పోయించాలా?... దీనికి స‌రైన స‌మ‌యం ఏదంటే..

When You Should Buy Petrol Or Diesel In Morning Or Night - Sakshi

పెట్రోల్‌, డీజిల్ వినియోగానికి సంబంధించి వినియోగ‌దారుల‌లో చాలా అపోహ‌లు తలెత్తుతుంటాయి. కారు మైలేజీ పెంచుకునే ఉపాయాలు మొద‌లుకొని పెట్రోల్ ధ‌ర వ‌ర‌కూ చాలామందిలో నిత్యం చ‌ర్చ‌లు జ‌రుగుతుంటాయి. ఈ నేప‌ధ్యంలో కొంద‌రు వాహ‌నంలో పెట్రోల్ పోయించేందుకు ప్ర‌త్యేక స‌మ‌యం ఉందని చెబుతూ, ఆ స‌మ‌యంలోనే ఇంధ‌నం పోయించేందుకు ఆస‌క్తి చూపిస్తుంటారు. పెట్రోల్ పోయించేందుకు ఉద‌యం త‌గిన స‌మ‌యం అని చాలామంది చెబుతుంటారు.

కొంద‌రు దీనిని ఖండిస్తూ, రాత్రివేళ వాహ‌నంలో పెట్రోల్ పోయించ‌డం ఉత్త‌మం అని అంటుంటారు. ఇటువంటి ప‌రిస్థితిలో పెట్రోల్ పోయించేందుకు త‌గిన స‌మ‌యం ఏద‌నే ప్ర‌శ్న మ‌న‌లో త‌లెత్తుతుంటుంది. నిజానికి ఇటువంటి వాద‌న‌లో ఎంత వాస్త‌వం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. సోష‌ల్ మీడియాలో దీనికి సంబంధించిన వివ‌రాలు వైర‌ల్ అవుతుంటాయి. పైగా ఈ అంశానికి సంబంధించి ఇంట‌ర్నెట్‌లో ప‌లు ఆర్టిక‌ల్స్ కూడా క‌నిపిస్తుంటాయి.
చదవండి: ఆ రోడ్డుపై ప్ర‌యాణిస్తూ 14 దేశాలు దాటేయొచ్చు.. ఎక్కడుందో తెలుసా!

వీటిలో రాత్రివేళ వాహ‌నంలో పెట్రోల్ పోయించ‌కూడ‌ద‌ని, తెల్ల‌వారుజామునే పెట్రోల్ పోయిస్తే డ‌బ్బులు ఆదా అవుతాయ‌ని, వాహ‌నంలో అధికంగా పెట్రోల్ ప‌డుతుంద‌ని చెబుతుంటారు. అయితే దీనిలో నిజం ఏమేర‌కు ఉన్న‌దో ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి వేడి కార‌ణంగా ఇంధ‌నం విస్త‌రిస్తుంది. అందుకే ఉద‌యం తెల్ల‌వారుతున్న స‌మ‌యంలో వాహనంలో పెట్రోల్ పోయిస్తే, అధికంగా నిండుతుంద‌ని చెబుతుంటారు. అయితే దీనిలో వాస్త‌వం లేద‌ని నిపుణులు తేల్చిచెప్పారు.

ప్ర‌పంచంలోని అత్య‌ధిక ఇంధ‌న స్టేష‌న్ల‌లో భూమిలోప‌ల ట్యాంకుల‌లో పెట్రోల్ లేదా డీజిల్ రిజ‌ర్వ్ చేస్తుంటారు. ఫ‌లితంగా ఇంధ‌న ఉష్ణోగ్ర‌త‌లు స్థిరంగా ఉంటాయి. పైగా ట్యాంకుల‌కు అత్య‌ధిక ద‌ళ‌స‌రితో కూడిన మూత‌లు ఉంటాయి. ఈ విధంగా చూస్తే వాహ‌నంలో ఏ స‌మ‌యంలో పెట్రోల్ పోయించినా దానిపై ఉష్ణోగ్ర‌త ప్ర‌భావం ప‌డ‌దు. ఇంద‌న సంకోచ‌, వ్యాకోచాల‌లో తేడా ఏర్ప‌డ‌దు. అందుకే ఉద‌యం వేళ‌లో వాహ‌నంలో పెట్రోల్ పోయించిన‌ప్ప‌టికీ ఎటువంటి తేడా రాదు. తెల్ల‌వారుజామున పెట్రోల్ పోయించ‌డం వ‌ల‌న ప్ర‌త్యేక ప్ర‌యోజ‌నం ఏమీ ఉండ‌ద‌ని నిపుణులు స్ప‌ష్టం చేస్తున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top