భారీగా తగ్గిన ముఖ్యమంత్రి ఆస్తులు | West Bengal Assembly Elections: Massively Reduced CM Assets | Sakshi
Sakshi News home page

భారీగా తగ్గిన ముఖ్యమంత్రి ఆస్తులు

Mar 26 2021 2:10 AM | Updated on Mar 26 2021 10:52 AM

West Bengal Assembly Elections: Massively Reduced CM Assets - Sakshi

గత ఎన్నికలతో పోలిస్తే ముఖ్యమంత్రి ఆస్తుల విలువ దాదాపు సగం మేర తగ్గింది.

కోల్‌కతా: గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆస్తుల విలువ దాదాపు సగం మేర తగ్గింది. నందిగ్రామ్‌ నుంచి బరిలోకి దిగుతున్న మమత ఈసీకి తన ఆస్తుల వివరాలు వెల్లడించారు. మమత డిక్లరేషన్‌ ప్రకారం ప్రస్తుతం ఆమె ఆస్తుల విలువ 16,72, 352 రూపాయలు. 2016లో ఆమె భవానీపూర్‌ నుంచి పోటీ చేశారు. ఆ సందర్భంగా ఆమె ఆస్తుల విలువ 30, 45, 013 రూపాయలుగా డిక్లరేషన్‌ ఇచ్చారు.

టీఎంసీకే చెందిన అభ్యర్ధులు మమతా భూనియా, సుకుమార్‌ డే ఆస్తుల విలువ సైతం దాదాపు 36- 37 శాతం తగ్గినట్లు డిక్లరేషన్‌లో పేర్కొన్నారు. మరోవైపు సీపీఎంకు చెందిన షేక్‌ ఇబ్రహీం అలీ(పన్సుకురా పుర్బా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు) ఆస్తుల విలువ 2016తో పోలిస్తే అనూహ్యంగా 2141 శాతం పెరిగింది. దీంతో ఈ ఐదేళ్లలో అత్యంత అధికంగా ఆస్తుల విలువ పెరిగిన అభ్యర్ధుల్లో ఆయన తొలిస్థానంలో నిలిచారు. 2016లో ఆయన ఆస్తుల విలువ రూ. 49,730గా పేర్కొనగా, ప్రస్తుతం రూ. 10, 64, 956గా చూపారు. టీఎంసీకి చెందిన కాకద్వీప్‌ అభ్యర్ధి మంతురామ్‌ పఖీరా ఆస్తుల విలువ 736 శాతం పెరిగి రూ. 59 లక్షలకు చేరింది.

చదవండి: ‘సాగర్‌’.. సస్పెన్స్‌: పోటీదారులెవరో..?‌
చదవండి: ‘నీ జన్మకు సిగ్గుందా?’ కమిషనర్‌పై బీజేపీ ఎమ్మెల్సీ చిందులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement