బావిలోకి దూసుకెళ్లిన వ్యాన్‌.. 14 మంది మృతి | Van Falls Into Well In Solapur Maharashtra | Sakshi
Sakshi News home page

బావిలోకి దూసుకెళ్లిన వ్యాన్‌.. 14 మంది మృతి

Jun 14 2026 7:36 PM | Updated on Jun 14 2026 7:43 PM

Van Falls Into Well In Solapur Maharashtra

సోలాపూర్‌: మహారాష్ట్రలోని సోలాపూర్‌లో విషాదం జరిగింది. బావిలోకి వ్యాన్‌ దూసుకెళ్లడంతో 14 మంది మృతి చెందారు. ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే రెస్క్యూ టీమ్‌లు, స్థానిక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు.

డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వ్యాన్‌.. రహదారి పక్కనే ఉన్న పొలంలోని బావిలోకి దూసుకెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతులను పండరపూర్ తాలూకాలోని రంజని గ్రామస్తులుగా గుర్తించారు. ప్రమాదానికి కచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement