యూపీఎస్సీ మెయిన్స్‌ ఫలితాలు విడుదల | Sakshi
Sakshi News home page

యూపీఎస్సీ మెయిన్స్‌ ఫలితాలు విడుదల

Published Sat, Dec 9 2023 6:11 AM

UPSC CSE Mains Result 2023 declared - Sakshi

న్యూఢిల్లీ: అఖిల భారత సరీ్వసులకు ఉద్యోగుల ఎంపిక నిమిత్తం నిర్వహించిన యూపీఎస్సీ–2023 మెయిన్స్‌ ఫలితాలు శుక్రవారం వెల్లడయ్యాయి. మెయిన్స్‌ పరీక్షలను గత సెపె్టంబర్‌లో నిర్వహించడం తెలిసిందే. గత మే నెలలో నిర్వహించిన ప్రిలిమ్స్‌ పరీక్షలను దాదాపు 13 లక్షల మంది రాశారు.

15 వేల మంది మెయిన్స్‌కు ఎంపికయ్యారు. వారిలో దాదాపు 2,500 మంది తాజాగా ఇంటర్వ్యూకు అర్హత సాధించినట్టు సమాచారం. ఇంటర్వ్యూ తేదీలతో త్వరలో నోటిఫికేషన్‌ వెలువడనుంది. ఈసారి మొత్తం 1,105 మందిని సివిల్‌ సరీ్వసులకు యూపీఎస్సీ ఎంపిక చేయనుంది.

Advertisement
 
Advertisement