157 నర్సింగ్‌ కాలేజీలు

Union Cabinet approves setting up of 157 govt nursing colleges - Sakshi

న్యూఢిల్లీ: ఇప్పటికే ఉన్న వైద్య కళాశాలలకు అనుబంధంగా రూ.1,570 కోట్ల వ్యయంతో నూతనంగా 157 నర్సింగ్‌ కళాశాలల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. సంబంధిత కేబినెట్‌ భేటీ నిర్ణయాలను ఆ తర్వాత మీడియాకు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ఢిల్లీలో చెప్పారు. ‘కొత్త కాలేజీల రాకతో ఏటా దాదాపు 15,700 కొత్త నర్సింగ్‌ గ్రాడ్యుయేట్‌ సీట్లు అందుబాటులో ఉంటాయి.

ప్రతీ కాలేజీలు 100 బీఎస్సీ(నర్సింగ్‌) సీట్లు ఉంటాయి. మొత్తం 157కుగాను యూపీలో 27, రాజస్థాన్‌లో 23, మధ్యప్రదేశ్‌లో 14, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌లో చెరో 11 , కర్ణాటకలో నాలుగు కాలేజీలు నెలకొల్పుతాం’ అని మాండవీయ చెప్పారు. బ్రిటన్‌లో 26 వేల మంది, అమెరికాలో 16వేల మంది, ఆస్ట్రేలియాలో 12వేల మంది, గల్ఫ్‌ దేశాల్లో 20వేల మంది భారతీయ నర్సులు సేవలందిస్తున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top