టీవీకే పార్టీ ఆఫీసుకు నిప్పు పెట్టిన దుండగులు | TVK's Trichy office reportedly set on fire by unidentified miscreants | Sakshi
Sakshi News home page

టీవీకే పార్టీ ఆఫీసుకు నిప్పు పెట్టిన దుండగులు

May 1 2026 3:51 PM | Updated on May 1 2026 4:04 PM

TVK's Trichy office reportedly set on fire by unidentified miscreants

సాక్షి,  చెన్నై: తమిళనాడులో అధికారం పీఠం దక్కించుకోబోతోందన్న వార్తల మధ్య . నటుడు విజయ్ పార్టీ టీవీకే ఆఫీసుకు నిప్పు పెట్టారన్న వార్త సంచలనంగా మారింది.  తిరుచిలోని టీవీకే కార్యాలయానికి కొందరు వ్యక్తులు నిప్పు పెట్టారని న్యూస్18 నివేదిక తెలిపింది. శ్రీరంగం నియోజకవర్గంలో పార్టీ ప్రచార కార్యాలయంగా ఉపయోగిస్తున్న ఈ ఆఫీసుకు గుర్తు తెలియని వ్యక్తులు ఈ ప్రాంగణాన్ని ధ్వంసం చేసినట్లు సమాచారం.

ఈ అగ్నిప్రమాదంలో కార్యాలయం పూర్తిగా కాలిపోయిందని, ఓటర్ల జాబితాలు, పత్రాలు, బ్యానర్లు, రోజువారీ ఎన్నికల కార్య కలాపాలకు ఉపయోగించే పరికరాలు వంటి కీలకమైన ప్రచార సామగ్రి నాశనమైనట్టు తెలుస్తోంది. శ్రీరంగం నియోజకవర్గం టీవీకే అభ్యర్థి రమేష్, గుర్తు తెలియని వ్యక్తులు తన ఎన్నికల కార్యాలయానికి నిప్పు పెట్టారని, దీంతో కార్యాలయానికి తీవ్ర నష్టం వాటిల్లిందని ఆరోపించారు. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు, అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని, ఓట్ల లెక్కింపు ప్రక్రియ సమయంలో తగిన భద్రత కల్పించాలని కోరారు.

 కాగా  అయిదు  రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా జరిగి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మే 4న జరగనుంది.  ఈ ఫలితాల్లో డీఎంకే కూటమి మళ్లీ అధికారంలోకి వస్తుందని చాలా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. యాక్సిస్ మై ఇండియా సర్వే  మాత్రం విజయ్‌ పార్టీ సునామీ తథ్యమని జోస్యం చెప్పింది. 

 

Advertisement
 
Advertisement
Advertisement