జయలలిత చివరి రోజుల్లో తీసుకున్న నిర్ణయాలపై రహస్య విచారణ

TamilNadu: Secret Investigation On Irregularities During Reign Of Jayalalitha - Sakshi

అనేక కీలక నిర్ణయాలపై విచారణ! 

ఫైళ్లలో ‘జే జే’ అనే సంతకాలపై సందేహాలు 

తమిళనాట డీఎంకే ప్రభుత్వం రహస్య విచారణ

సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే చీఫ్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత చివరి రోజుల్లో తీసుకున్న అనేక నిర్ణయాల వెనుక అసలు కారణాలను వెలికితీయాలని తమిళనాడులో కొత్తగా కొలువుతీరిన డీఎంకే ప్రభుత్వం ఉన్నతాధికారులను ఆదేశించింది. ఆసుపత్రిలో జయలలిత చివరి ఆరునెలల కాలంలో ఫైళ్లపై సందేహాస్పద సంతకాలు, రూ.కోట్ల ఒప్పందాలు, టెండర్లు కట్టబెట్టడం తదితర అంశాలపై కూపీలాగాలని ఐఏఎస్‌ అధికారులను నూతన ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆదేశించారు.

విశ్వసనీయ సమాచారం ప్రకారం తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ముఖ్యమంత్రి స్టాలిన్‌ కోవిడ్‌ పరిస్థితులను చక్కబెట్టడంపైనే ప్రధానంగా దృష్టిసారించారు. గత అన్నాడీఎంకే ప్రభుత్వం అమలుచేసిన కోవిడ్‌ ఆంక్షలకు తోడుగా పూర్తి లాక్‌డౌన్‌ను ప్రవేశపెట్టి అమలుచేస్తున్నారు. అదే సమయంలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలపై విచారణ చేపట్టేందుకు స్టాలిన్‌ రహస్యంగా సమాయుత్తం అవుతున్నారు. అన్నాడీఎంకే హ యాంలో చేసుకున్న ఒప్పందాలు, జరిపిన నియా మకాలు, ఎవరెవరికి ప్రభుత్వ పనులు అప్పగించారు? ఏ పనులకు ఎంత ఖర్చు చేశారు? అనే అం శాలపై పూర్తి వివరాలు సేకరించాల్సిందిగా ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు. తన చుట్టూ అత్యంత విశ్వాసపాత్రులు, నిజాయితీపరులైన ఐఏఎస్‌ అధికారులను నియమించుకున్నారు.

గత ప్రభుత్వ నిర్ణయాలను బహిరంగంగా వ్యతిరేకించిన ఐఏఎస్‌ అధికారులకు కీలక బాధ్యతలను అప్పగించారు. గత అన్నాడీఎంకే ప్రభుత్వంలోని అనేక వ్యవహారాలపై కూపీలాగే బాధ్యతలను సదరు ఐఏఎస్‌ అధికారులకు అప్పగించారు. ఈ అంశాల్లో ప్రధానమైనది ప్రభుత్వ ఫైళ్లలో ‘జయలలిత సంతకం’. 2016 సెపె్టంబరు 23న అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన జయలలిత అదే ఏడా ది డిసెంబరు 5న తుదిశ్వాస విడిచారు. ఆమె మరణానికి అసలు కారణాలను కనుగొనేందుకు అప్పటి ప్రభుత్వం నియమించిన విచారణ కమిషన్‌ ఇంతకాలమైనా ఇంకా నివేదిక సమరి్పంచలేదు. మరణానికి ముందు.. ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతున్న ఆరునెలల మధ్య కాలంలో ప్రభు త్వం తీసుకున్న నిర్ణయాలపై విచారణ జరపాలని డీఎంకే ప్రభుత్వం నిర్ణయించుకుంది.

జయ ఆసుపత్రిలో చేరేముందు కొన్ని వారాలపాటు ఫైళ్లపై ఆమె సంతకాలు చేయలేదనే ఆరోపణలు, విమర్శలు ప్రస్తుతం రాష్ట్ర సచివాలయంలో పెరిగాయి. అధికారులు కొన్ని ఫైళ్లను వెలికి తీసి పరిశీలించగా జయలలిత సంతకం చేయకుండానే నిర్ణయాలు జరిగినట్లు బయటపడింది. ఆయా ఫైళ్లలో సీఎం హోదాలో జయలలిత సంతకం చేయాల్సిన చోట ‘జే æజే’ అనే అక్షరాలే ఉన్నాయి. ఇలాంటి సంతకాలున్న ఫైళ్లపైనే ముఖ్యంగా విచారణ జరపాలని సీఎం స్టాలిన్‌ ఆదేశించారు. రూ.కోట్ల విలువైన కొన్ని టెండర్లు సైతం జయసంతకం లేకుండానే ఆమోదం పొందినట్లు తేలింది.

జయకు తెలియ కుండానే ఈ నిర్ణయాలు జరిగాయా? లేక ఆసుపత్రిలో ఉన్న ఆమెకు చెప్పి చేశారా? అప్పట్లో అత్యున్నత బాధ్యతల్లో ఉన్న ఉన్నతాధికారుల ప్రమే యంపై సైతం దర్యాప్తు జరుగుతున్నట్లు సమాచారం. జె.జె. అనే అక్షరాలు జయలలిత సంతకమేనని ఆసుపత్రిలో ఉన్నపుడు ఆమె అలా సంతకం చేశా రని కొందరు చెబుతున్నారు. డీఎంకే అధికారం చేపట్టిన తరువాత అన్నాడీఎంకేను ఎ లాంటి ఒత్తిళ్లకు గురిచేయలేదు. కానీ, గత ప్రభుత్వ అవకతవకలపై నిగ్గుతేల్చేందుకు పరోక్షంగా డీఎంకే ప్రభుత్వం సిద్ధమైందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top