
నాగపూర్: మహారాష్ట్రలోని నాగపూర్‌లో తృటిలో విమాన ప్రమాదం తప్పింది. నాగ్‌పూర్ నుండి కోల్‌కతాకు వెళ్తున్న విమానాన్ని తిరిగి నాగపూర్‌లో అత్యవసర ల్యాండింగ్ చేయాల్సివచ్చింది. ఒక పక్షి ఢీకొనడంతో విమానం ముందు భాగం దెబ్బతింది. దీంతో పైలట్ అత్యవసర ల్యాండింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో 272 మంది ప్రయాణికులున్నారు. ఘటన దరిమిలా వారంతా సురక్షితంగా ఉన్నారు.
There has been a suspected bird strike on IndiGo's 6E812 Nagpur-Kolkata flight. We are trying to analyse what has happened. More details awaited: Abid Ruhi, Senior Airport Director, Nagpur Airport, Maharashtra
— ANI (@ANI) September 2, 2025
విమానాన్ని పక్షి ఢీకొన్నంతనే విమానం కుదుపునకు గురయ్యింది. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. అయితే పైలట్ ఎంతో చాకచక్యంతో అత్యవసర ల్యాండింగ్ చేశారు. విమానాశ్రయం సీనియర్ డైరెక్టర్ అబిద్ రుహి ఒక ప్రకటనలో ‘ఇండిగోకు చెందిన నాగ్‌పూర్-కోల్‌కతా విమానం నంబర్ 6ఈ812ని పక్షి ఢీకొన్నదని, తరువాత విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడం జరిగిందన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.