దేశవ్యాప్తంగా ఏకరూప మార్గదర్శకాల జారీకి మొగ్గు
న్యూఢిల్లీ: నేరమయ కేసుల్లో చార్జ్‌షీట్ దాఖ లుచేశాక సైతం ట్రయల్ కోర్టులు అభియో గాల నమోదుపై తుదినిర్ణయం తీసుకోకపో వడం, దీంతో కేసుల విచారణలో జాప్యంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. దీంతో క్రిమినల్ కేసుల కొండ పేరుకుపోయి న్యాయస్థానాలపై పనిభారం, ఒత్తిడి అత్యంత తీవ్రంగా ఉంటోందని, చివరకు కొన్ని కేసుల విచారణ దశాబ్దాల తరబడి కొనసాగుతోందని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది.
ఈ నేప థ్యంలో దేశవ్యాప్తంగా అన్ని న్యాయస్థానాల్లో అమలయ్యేలా ఏకరూప నిబంధనావళిని రూ పొందిస్తామని జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ ఎన్‌వీ అంజారి యాల ధర్మాసనం స్పష్టంచేసింది. ఈ విషయంలో తమకు సహాయకులుగా ఉండాలని అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాలను కోర్టు కోరింది. ‘‘మేం అంతా గమనిస్తున్నాం. సమ యం గడుస్తోందిగానీ ట్రయల్ కోర్టుల్లో పద్ధతి మారట్లేదు.
నిందితులపై పోలీసులు, దర్యాప్తు సంస్థలు నేరాభియోగాలు మోపుతు న్నారు. సంబంధిత ఛార్జ్‌షీట్‌లను ట్రయల్ కోర్టులకు సమ ర్పిస్తున్నారు. కానీ ట్రయల్ కోర్టులు మాత్రం మూడు, నాలుగేళ్లు గడుస్తున్నా చార్జ్‌షీట్‌లపై తమ నిర్ణయాన్ని ఖరారుచేయట్లేవు. దీంతో విచా రణ మరింత ఆలస్యమవుతోంది. నేరం నమోదుకాకపోతే అసలా కేసులో వాదోపవాదనలు మొదలుకావు. ఇకనైనా కింది కోర్టుల వైఖరి మారేలా దేశవ్యాప్త గైడ్‌లైన్స్ ఇవ్వాల్సిందే’’ అని ధర్మాసనం అభిప్రాయపడింది.
ఈ అంశంలో కోర్టు సహాయకులు(అమికస్ క్యూరీ)గా సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రాను ధర్మాసనం నియమించింది. బిహార్‌లో క్రిమినల్ కేసుకు సంబంధించి ఒక వ్యక్తిపై చార్జ్‌షీట్ దాఖలై రెండేళ్లు గడుస్తున్నా కిందికోర్టు ఆ నేరాభియోగాలపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నాన్చుడి ధోరణి అవలంభిస్తోందని, తన క్లయింట్‌కు న్యాయం చేయాలంటూ ఒక న్యాయవాది చేసిన అభ్యర్థన సందర్భంగా సుప్రీంకోర్టు పైవిధంగా స్పందించింది.
ఈ కేసును రెండు వారాల తర్వాత విచారిస్తామని ధర్మాసనం తెలిపింది. ‘‘మహారాష్ట్రలోనూ ఇదే పరిస్థితి ఉంది. 600కుపైగా కేసులో ఇంకా విచారణ కోర్టులు దాఖలైన ఛార్జ్‌షీట్‌లపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు’’ అని మరో న్యాయవాది వాదించారు. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత చట్టం ప్రకారం సెషన్స్ కోర్టులో ఏదైనా కేసు విచారణకు వస్తే చార్జ్‌షీట్ దాఖలైన 60 రోజుల్లోపు ఆ నేరాభియోగాలపై సెషన్స్ కోర్టు తుది నిర్ణయం తీసుకోవాల్సిందే.
‘‘ నేరాన్ని వెంటనే నమోదుచేయని కారణంగా ట్రయల్ కోర్టుల్లో క్రిమినల్ కేసుల విచారణ ఆలస్య మవుతోంది. సివిల్ కేసుల్లో ట్రయల్ కోర్టులు ఆయా అంశాలను సరిగా ప్రస్తావించని కారణంగా ఆలస్యమవుతోంది’’అని జస్టిస్ కుమార్ అన్నారు. మాజీ హైకోర్టు న్యాయమూర్తి, సీనియర్ న్యాయవాది ఎస్.నాగముత్తు ఈ అంశంలో కోర్టుకు సహాయకులుగా ఉండాలని సుప్రీంకోర్టు కోరింది.


