దేశ వ్యాప్తంగా, విదేశాలతో కూడా ఈ కేసుకు సంబంధముంది
దర్యాప్తును స్వయంగా పర్యవేక్షిస్తాం: సుప్రీంకోర్టు
ఎఫ్‌ఐఆర్ వివరాలు..దర్యాప్తు పురోగతి తెలపాలని రాష్ట్రాలకు ఆదేశం
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కొనసాగుతున్న డిజిటల్ అరెస్ట్ మోసాలపై సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ తరహా నేరాలపై ఇప్పటి వరకు నమోదైన కేసుల వివరాలు, దర్యాప్తు పురోగతిని తమకు తెలపాలంటూ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 3వ తేదీకల్లా పూర్తి వివరాలు పంపాలని, సీబీఐ దర్యాప్తును సమీక్షిస్తామని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్య బాగీ్చల ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది. గత విచారణ సందర్భంగా తమకు పూర్తి వివరాలు తెలపాలంటూ కేంద్ర ప్రభుత్వం, సీబీఐలకు సుప్రీంకోర్టు నోటీసులిచి్చంది. ఈ కేసును సోమవారం జస్టిస్ జస్టిస్ సూర్యకాంత్, జాయ్‌మాల్య బాగీ్చల ధర్మాసనం విచారించింది.
ఎఫ్‌ఐఆర్ వివరాలను అందించండి
దేశంలో జరుగుతున్న సైబర్ మోసాలపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ల వివరాలను నవంబర్ 3వ తేదీన చేపట్టే తదుపరి విచారణ నాటికి అందించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా జరిగిన విచారణ, దర్యాప్తు పురోగతి వంటి అంశాలను వివరించాలని కోరింది. వృద్ధులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఈ మోసాలపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. తమను డిజిటల్ అరెస్టు చేయాలంటూ సుప్రీంకోర్టు, హైకోర్టులు జారీ చేసిన ఆదేశాల ఫోర్జరీ పత్రాలను చూపి, భయపెట్టి రూ.1.05 కోట్లు కాజేశారంటూ హరియాణాకు చెందిన వృద్ద దంపతులు
సెపె్టంబర్ 21న సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్‌కి లేఖ రాశారు. దీనిపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టడం తెల్సిందే.
సమన్వయం అవసరం
సైబర్ నేరాలు దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ జరుగుతున్నాయని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. వీటిని అరికట్టాలంటే కేంద్ర, రాష్ట్రాల దర్యాప్తు విభాగాల మధ్య సమన్వయం అవసరముందని జస్టిస్ సూర్యకాంత్ అభిప్రాయపడ్డారు. ‘హోం శాఖ, సైబర్ క్రైం విభాగం సహకారంతో సీబీఐ ఇప్పటికే పలు కేసులను విచారిస్తోంది’అని సొలిసిటర్ జనరల్ తుషా ర్ మెహతా ధర్మాసనానికి తెలిపారు.
‘ఈ కుంభకోణం ప్రత్యేక విచారణ బాధ్యతలు చేపట్టేందుకు సీబీఐ సిద్ధంగా ఉందా? అందుకు అవసరమైన అదనపు వ్యయం ఏమిటి?‘అని జస్టిస్ బాగ్చీ తుషార్ మెహతాను అడిగారు. ‘సైబర్ నేరాలలో నిపుణులు అవసరమైతే, వారు మాకు చెప్పవచ్చు’అంటూ జస్టిస్ సూర్యకాంత్ అన్నా రు. దేశంతోపాటు మయన్మార్, థాయ్‌లాండ్ దేశాల నుంచి కూడా ఇవి జరుగుతున్నందున వీటిపైనా విచార ణ చేపట్టేందుకు అవసరమైన ప్రణాళికతో తదుపరి విచారణ సమయానికి సీబీఐ ముందుకు రావాలని కోరారు.


