బిల్లుకు మద్దతితివ్వకుంటే చరిత్రహీనులు: బండి సంజయ్‌ | Support the Women's Reservation Bill, Bandi Sanjay | Sakshi
Sakshi News home page

బిల్లుకు మద్దతితివ్వకుంటే చరిత్రహీనులు: బండి సంజయ్‌

Apr 12 2026 4:09 PM | Updated on Apr 12 2026 4:47 PM

Support the Women's Reservation Bill, Bandi Sanjay

కేంద్రప్రభుత్వం తీసుకవచ్చిన మహిళా బిల్లును అడ్డుకంటే చరిత్ర హీనులవుతారని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అన్నారు. పార్లమెంటులో మహిళా బిల్లుకు అన్ని పార్టీలు మద్దతివ్వాలని తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లుతో చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం చారిత్రాత్మకమని.. మహిళల ప్రాతినిథ్యం పెరగాల్సిందేనన్నారు.

అయితే అంతకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్‌ ఫ్లోర్‌ లీడర్లకు లేఖ రాశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతివ్వాలని కోరారు. కాగా ఈ నెల 16,17,18 తేదీలలో ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశాలు జరగనున్నాయి.ఈ నేపథ్యంలో బీజేపీ తమ పార్టీ ఎంపీలకు త్రీ-లైన్‌-విఫ్‌ జారీ చేసింది. ప్రభుత్వం కొన్ని కీలకమైన బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించుకునే అవకాశం ఉన్నందున సభ్యులందరూ తప్పనిసరిగా హాజరుకావాలని తెలిపింది. 

Advertisement
 
Advertisement
Advertisement