స్పైస్‌జెట్ విమానం టాయిలెట్‌లో చిక్కుకున్న ప్రయాణికుడు | SpiceJet Passenger Gets Stuck Inside Toilet | Sakshi
Sakshi News home page

స్పైస్‌జెట్ విమానం టాయిలెట్‌లో చిక్కుకున్న ప్రయాణికుడు

Jan 17 2024 11:03 AM | Updated on Jan 17 2024 11:47 AM

SpiceJet Passenger Gets Stuck Inside Toilet - Sakshi

ముంబయి: స్పైస్‌జెట్ విమానం టాయిలెట్స్‌లో చిక్కుకుని ఓ ప్రయాణికుడు నరకయాతన అనుభవించాడు. ముంబయి నుంచి బెంగళూరు వరకు వెళ్లే స్పైస్‌జెట్ విమానంలో ఈ ఘటన జరిగింది. టేకాఫ్ అయిన దగ్గర నుంచి బెంగళూరులో ల్యాండ్ అయ్యేవరకు గంటకుపైగా టాయిలెట్‌లోనే ఉండిపోయాడు. 

విమానం ముంబయిలో టేకాఫ్ అయ్యాక ఓ వ్యక్తి టాయిలెట్స్‌కి వెళ్లాడు. తిరిగి వచ్చే క్రమంలో టాయిలెట్స్ డోర్ లాక్ అయిపోయింది. ఎంత ప్రయత్నించినా రాలేదు. క్రూ సిబ్బంది అతనికి సహాయం చేసే ప్రయత్నం చేశారు. తీరా బెంగళూరులో ల్యాండ్ అయ్యాక.. ఇంజినీర్ వచ్చి డోర్ ఓపెన్ చేసేవరకు బాధిత వ్యక్తి టాయిలెట్స్‌లోనే ఉండిపోయాడు.  

"జనవరి 16న ముంబయి నుంచి బెంగళూరుకు వెళ్తున్న స్పైస్‌జెట్ విమానంలో దురదృష్టవశాత్తూ ఒక ప్రయాణికుడు సుమారు గంటసేపు టాయిలెట్స్‌లో చిక్కుకుపోయాడు. డోర్ లాక్‌ లోపం కారణంగా విమానం గాలిలో ప్రయాణించింది. ప్రయాణమంతా మా సిబ్బంది ఆ ప్రయాణికునికి మార్గనిర్దేశం చేశారు. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నాం." అని స్పైస్‌జెట్ తెలిపింది. 

ఇదీ చదవండి: రిపబ్లిక్ డే వేళ ఢిల్లీలో గోడలపై ఖలిస్థానీ రాతల కలకలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement