ఏం తెలివిరా నాయనా.. బ్యాంకులో కోటి విలువ చేసే బంగారం చోరి!

Robbers Dig Tunnel To Loot Gold From SBI Branch In Kanpur - Sakshi

దొంగలు దొంగతనం చేసేందుకు తమ రూట్‌ మార్చుకుంటున్నారు. దొంగతనం కోసం క్రేజీగా థింక్‌ చేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. కేటుగాళ్లు ఏకంగా బ్యాంక్‌ను టార్గెట్‌ చేసి రూ.కోటి విలువ చేసే 1.8కేజీల బంగారం దొంగిలించారు. వారు దొంగతనం చేసి ప్లాన్‌ చూసి పోలీసులు ఖంగుతిన్నారు.

వివరాల ప్రకారం.. కాన్పూర్‌లోని ఎస్‌బీఐ భనుతి శాఖలో భారీ దొంగతనం జరిగింది. దొంగతనం జరిగిన విషయంలో ఉద్యోగులు ఆఫీసుకు వచ్చిన తర్వాత వారికి ఈ విషయం బోధపడింది. అయితే, దొంగతనం కోసం దొంగలు మాస్టర్‌ ప్లాన్‌ వేసి స్కెచ్‌ గీసుకున్నారు. ప్లాన్‌ ప్రకారం.. ఆఫీసు పక్కనే ఉన్న ఖాళీ స్థలం నుంచి బ్యాంకులోని స్ట్రాంగ్‌రూంలోకి 10 అడుగుల సొరంగం తవ్వి బ్యాంక్‌లోకి చేరుకున్నారు. అనంతరం.. లాకర్‌ను పగలగొట్టి అందులో ఉన్న రూ.కోటి విలువ చేసే 1.8కేజీల బంగారం చోరీ చేశారు.

ఉదయం బ్యాంక్‌కు వచ్చిన ఉద్యోగులకు ఈ విషయం తెలిసి షాకయ్యారు. ఈ క్రమంలో ఎంత సొమ్ము దొంగతనం చేశారో తెలుసుకునేందు బ్యాంకు అధికారుల తల ప్రాణం తోకకు వచ్చింది. కొన్ని గంటల తర్వాత ఎంత సొమ్ము చోరీకి గురైందో అంచనా వచ్చారు. దీంతో, వెంటనే బ్యాంకు అధికారులు ఈ విషయాన్ని పోలీసులకు చెప్పడంతో రంగంలో దిగిన టీమ్‌.. ఫింగర్‌ ప్రింట్స్‌, ఇతర ఆధారాల ద్వారా దొంగల కోసం గాలింపు ప్రక్రియ చేపటినట్టు తెలిపారు. అయితే, బ్యాంకు గురించి బాగా తెలిసిన వ్యక్తులే ఈ దోపిడీకి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top