వాట్సప్‌ చాట్‌ షేర్‌ చేసిన రియా

Rhea Chakraborty Shares WhatsApp Chats - Sakshi

రియా ఆరోపణలకు శ్వేతా సింగ్‌ కౌంటర్‌

న్యూఢిల్లీ/ముంబై : దివంగత నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ తన సోదరి ప్రవర్తనపై బాధపడుతూ తనతో చేసిన వాట్సాప్‌ చాట్‌ స్క్రీన్‌షాట్లను నటి రియా చక్రవర్తి షేర్‌ చేశారు. సుశాంత్‌ సోదరి ప్రియాంక సింగ్‌ తన పట్ల వ్యవహరించిన తీరుపై సుశాంత్‌ కలత చెందాడని ఆ వాట్సాప్‌ చాట్‌ తేటతెల్లం చేస్తోందని రియా చెప్పారు. తమ మధ్య దూరం పెంచేందుకు సుశాంత్‌ రూమ్మేట్‌ సిద్ధార్ధ్‌ పిధానిని ప్రియాంక ప్రేరేపించేదని పలు వాట్సాప్‌ మెసేజ్‌ల్లో రియాతో సుశాంత్‌ పేర్కొన్నట్టు ఆ స్క్రీన్‌షాట్లలో ప్రస్తావించారు.కాగా రియా ఆరోపణలను సుశాంత్‌ మరో సోదరి శ్వేతా సింగ్‌ కీర్తి తోసిపుచ్చారు. ప్రియాంకతో పాటు తనతోనూ సుశాంత్‌ అన్యోన్యంగా ఉండేవారని చెప్పారు. ప్రియాంకతో తన అనుబంధంపై సుశాంత్‌ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన వీడియోను శ్వేత షేర్‌ చేశారు.

కాగా సుశాంత్‌ మృతికి ఆయన గర్ల్‌ఫ్రెండ్‌ రియా చక్రవర్తి కారణమంటూ దివంగత నటుడి కుటుంబ సభ్యులు బిహార్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. సుశాంత్‌ కేసును సీబీఐ విచారణకు అప్పగించారు. ఇక సుశాంత్ విషాదాంతం నేప‌థ్యంలో మ‌నీలాండ‌రింగ్ ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న రియా సోమ‌వారం మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) ఎదుట‌ విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. త‌న సోద‌రుడు సౌవిక్ చ‌క్ర‌వ‌ర్తితో క‌లిసి ఆమె ముంబైలోని ఈడీ కార్యాల‌యానికి చేరుకున్నారు. సుశాంత్‌కు చెందిన కోట్లాది రూపాయ‌ల‌ను అక్ర‌మంగా దారి మ‌ళ్లించిన ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న రియాపై ఈడీ అధికారులు మ‌రోసారి ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. చదవండి : సుశాంత్‌ కేసు : క్వారంటైన్‌లో బిహార్‌ పోలీసుల విచారణ

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top