చట్టాల రద్దుపై కేంద్రానికి తికాయత్‌ అల్టిమేటం

Repeal farm laws by 26 Nov or farmers will intensify stir at Delhi borders - Sakshi

ఘజియాబాద్‌: వివాదాస్పద కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని భారతీయ కిసాన్‌ యూనియన్‌(బీకేయూ) నేత రాకేశ్‌ తికాయత్‌ తేల్చిచెప్పారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వానికి నవంబర్‌ 26 దాకా గడువు ఇస్తున్నామని చెప్పారు. అప్పటిలోగా మూడు చట్టాలకు మంగళం పాడకపోతే ఢిల్లీలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మోదీ ప్రభుత్వం ఒకవేళ ఆ చట్టాలను ఈరోజే రద్దు చేస్తే పోరాటాన్ని ఇప్పుడే ఆపేస్తామని చెప్పారు.  నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ శివార్లలోని సింఘు, టిక్రీ, ఘాజీపూర్‌ బోర్డర్‌ పాయింట్ల వద్ద సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కేఎం) ఆధ్వర్యంలో రైతులు కొనసాగిస్తున్న ఉద్యమానికి నవంబర్‌ 26న సంవత్సరం పూర్తికానుంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top