అయోధ్యకు ‘రామాయణ క్రూయిజ్‌ టూర్‌’ | Ramayan Cruise Tour for Devotees Visiting Ayodhya Soon On Saryu River | Sakshi
Sakshi News home page

అయోధ్యకు ‘రామాయణ క్రూయిజ్‌ టూర్‌’

Dec 5 2020 6:44 PM | Updated on Dec 5 2020 7:14 PM

Ramayan Cruise Tour for Devotees Visiting Ayodhya Soon On Saryu River - Sakshi

న్యూఢిల్లీ: శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యను సందర్శించే భక్తుల కోసం పర్యాటక శాఖ సరయూ నదిలో  ‘రామాయణ క్రూయిజ్’ టూర్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో దీనిపై డిసెంబర్ 1 న కేంద్ర షిప్పింగ్‌, జల మార్గాల శాఖామంత్రి మన్సుఖ్ మాండవియా అధ్యక్షతన క్రూయిజ్‌ సేల అమలు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇది సరయూ నదిలో మొట్టమొదటి లగ్జరీ క్రూయిజ్ సేవ. ఈ సేవలతో పవిత్ర సరయు నదిలోన ప్రసిద్ధ ఘాట్ల గుండా సాగే ఈ ప్రయాణ ప్రధాన లక్ష్యం భక్తులకు ఆధ్యాత్మికతతో కూడిన అద్భుతమైన అనుభవానలు అందించడమే.

ఈ క్రూయిజ్‌లో అన్ని లగ్జరీ సౌకర్యాలతో, భద్రతా ప్రమాణాలు గ్లోబల్‌ స్టాండర్డ్‌ తో సమానంగా ఉంటాయని.. క్రూయిజ్ లోపల, బోర్డింగ్ పాయింట్‌ని రామ్‌చరితమానస్ థీమ్ ఆధారంగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ 80 సీట్ల క్రూయిజ్‌ ఫుల్లీ ఎయిర్‌ కండిషన్డ్‌ అని.. సుందరమైన ఘాట్ల సౌందర్యాన్ని చూడటానికి పెద్ద గాజు కిటికీలు ఉంటాయన్నారు. ఇక పర్యాటకుల సౌకర్యార్థం వంట గది, చిన్నగదితో కూడిన  సౌకర్యాలు ఏర్పాటు చేశామని తెలిపారు. రామాయణాన్ని తలపించేలా కొన్ని సంఘటనా చిత్రాలు, సెల్ఫీ పాయింట్లు ఉంటాయన్నారు. (చదవండి: 1992 డిసెంబర్‌ 6న ఏం జరిగింది ?)

అయోధ్య హిందువులు ఆరాధించే ఏడు ముఖ్యమైన పుణ్యక్షేత్రాలలో మొదటిదని, యుపీ టూరిజం గణాంకాల ప్రకారం 2019 సంవత్సరంలో సుమారు రెండు కోట్ల మంది పర్యాటకులు అయోధ్యను సందర్శించారని, రామ్ మందిరం పూర్తయిన తర్వాత పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తారని మన్సుఖ్ మాండవియా తెలిపారు. ‘రామాయణ క్రూయిజ్ టూర్’ పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఆకర్షించడమే కాక, ఈ ప్రాంతం ప్రత్యక్ష మరియు పరోక్ష ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తుందని, ఓడరేవులు, షిప్పింగ్ జలమార్గాల మంత్రిత్వ శాఖ క్రూయిజ్ సేవ సజావుగా సాగడానికి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను అందిస్తుందని తెలిపారు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement