చెన్నై: రామనాథపురంలోని ఓంశక్తి నగర్‌కు చెందిన సుబ్రమణియన్ కుమారుడు దీపన్ కుమార్ (30) ఖత్తార్‌లోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. తనతో పాటూ పనిచేసే ఫిలిప్పీన్స్ యువతి అర్ష (28) తో ప్రేమలో పడ్డాడు. వారి ప్రేమ 5 సంవత్సరాలు కొనసాగింది. ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీని తరువాత, దీపన్ కుమార్ తన స్వస్థలంలో తమిళ సాంస్కృతిక ఆచారాల ప్రకారం వివాహం చేసుకోవాలనే కోరికను అర్షకు వ్యక్తం చేశాడు. ఆమె దీనికి అంగీకరించింది. ఈ క్రమంలో సోమవారం వీరి వివాహం తమిళ సాంస్కృతి ఆచారాల ప్రకారం రామనాథపురంలో ఘనంగా జరిగింది.


