జైపూర్: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో జరిగిన స్లీపర్ బస్సు ప్రమాద ఘటన మరువకముందే, రాజస్థాన్‌లోని మనోహర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తోడి గ్రామంలో ఇటువంటి ప్రమాదమే చోటుచేసుకుంది. కార్మికులను తీసుకెళ్తున్న బస్సు హైటెన్షన్ విద్యుత్ లైన్‌ను తాకడంతో విద్యుదాఘాతం సంభవించింది. దీంతో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతిచెందారు. ఇంతలో బస్సులో మంటలు చెలరేగడంతో, దాదాపు 12 మంది గాయాల పాలయ్యారు.
ఉత్తరప్రదేశ్ నుండి రాజస్థాన్‌లోని మనోహర్ పూర్ పరిధిలోని తోడిలో గల ఇటుకల బట్టీకి కార్మికులను బస్సులో తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మార్గం మధ్యలో బస్సు ప్రమాదవశాత్తూ 11 వేల వోల్ట్‌ల విద్యుత్ లైన్ కు తగిలింది. ఫలితంగా బస్సు గుండా విద్యుత్ ప్రవహించింది. తరువాత బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఆకస్మిక ఘటనతో బస్సులోని ప్రయాణికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
VIDEO | Shahpura, Rajasthan: Two people were killed and over a dozen were injured after a bus caught fire upon coming in contact with a high-tension wire on the Jaipur-Delhi highway.#Rajasthan #JaipurDelhiHighway
(Source - Third party)
(Full video available on PTI Videos –… pic.twitter.com/reQQSmtkR3— Press Trust of India (@PTI_News) October 28, 2025
సమాచారం అందుకున్న మనోహర్ పూర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది, స్థానిక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని షాపురా సబ్-జిల్లా ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా కాలిన గాయాలతో బాధపడుతున్న ఐదుగురు కార్మికులను మెరుగైన చికిత్స కోసం జైపూర్‌కు తరలించారు. అగ్నిమాపక సిబ్బంది అగ్నిమాపక యంత్రాల సహాయంతో మంటలను అదుపులోనికి తెచ్చారు. రెండు మృతదేహాలను పోలీసులు పోస్ట్ మార్టం కోసం తరలించారు.ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: మరో వివాదంలో ప్రశాంత్ కిశోర్.. రెండు చోట్ల ఓటు.. టీఎంసీ ఆఫీసే చిరునామా!


