పట్టాలెక్కనున్న 696 సబర్భన్ రైళ్లు

కోల్‌కతా: బెంగాల్లో నవంబర్ 11 నుంచి 696 సబర్భన్ రైళ‍్ల సర్వీసులను పునరుద్ధరిస్తున్నట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆదివారం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపుల తరువాత రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. కరోనా వైరస్ కారణంగా మార‍్చి నెలలో సబర‍్భన్ రైళ్ల సర్వీసులును కేంద్రం రద్దు చేసింది. సబర్భన్ రైళ్లలో కోవిడ్ నిబంధనలను తప్పనిసరి చేస్తున్నట్టు, బెంగాల్ ప్రజల ప్రయాణానికి ఈ నిర‍్ణయం ఉపయోగపడనుందని, క్షేమకరమైనా, సులభతరమైనా ప్రయాణానికి కృషి చేస్తామని కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ట్విట్టర్‌లో తెలిపారు. (ప్రభుత్వ స్థలాలు కబ్జా కాకుండా కీలక నిర్ణయం)
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి