పంజాబ్‌ మంత్రికి 7 రోజుల ఈడీ కస్టడీ | Punjab Minister Sanjeev Arora Sent to 7-day ED Custody | Sakshi
Sakshi News home page

పంజాబ్‌ మంత్రికి 7 రోజుల ఈడీ కస్టడీ

May 11 2026 6:16 AM | Updated on May 11 2026 6:16 AM

Punjab Minister Sanjeev Arora Sent to 7-day ED Custody

గురుగ్రామ్‌: పంజాబ్‌ మంత్రి సంజీవ్‌ అరోరాను గురుగ్రామ్‌లోని ప్రత్యేక కోర్టు ఆదివారం ఏడు రోజుల ఈడీ కస్టడీకి అనుమతించింది. రూ.100 కోట్ల జీఎస్‌టీ కుంభకోణంలో మనీలాండరింగ్‌ ఆరోపణలతో శనివారం ఈడీ అధికారులు ఆయన్ను అరెస్ట్‌ చేశారు. 

గురుగ్రామ్‌ కేంద్రంగా పనిచేసే హాంప్టన్‌ స్కై రియాల్టీ లిమిటెడ్‌ (హెచ్‌ఎస్‌ ఆర్‌ఎల్‌) కంపెనీకి సంబంధించిన సంస్థలపై పూర్తి యజమానిగా, నియంత్రణాధికారిగా అరోరా వ్యవహరిస్తున్నారని ఈడీ పేర్కొంది. అవకతవకల వ్యవహారంలో అరోరా పాత్ర కీలకంగా ఉందని పేర్కొంది. నేరారోపణల్లో ఈయనతోపాటు, సహాయకుల ప్రమేయం ఎంతో తేల్చేందుకు ఈడీ కస్టడీ కోరడం సబబేనని జడ్జి తన ఉత్తర్వులో అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement