నా ముందు నగ్నంగా కూర్చోబెడితేనే గుప్తనిధి కనబడుతుందంటూ..!

A Priest Told  A woman To Sit Naked That The Tresure Would Automatically Unearth - Sakshi

బెంగళూరు: కంప్యూటర్‌లు వచ్చి ఎంతటి ఆధునిక యుగంలో జీవిస్తున్నప్పటికీ ఇంకా ఇలాంటి మూఢనమ్మకాలను కొంతమంది విశ్వస్తున్నారంటే వాళ్లను ఏమనాలో కూడా అర్ధంకాదు. అంతేందుకు ఒక చిన్నగ్రామం సైతం అత్యంత అభివృద్ధి పదంలోకి దూసుకుపోతున్న ఇంకా ఇలాంటి అమానుష ఘటనలకు తెరలేపుతున్నవారు అక్కడక్కడ తారసపడుతునే ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయం. అచ్చం అలానే ఇక్కడొక పూజారి గుప్తనిధులంటూ ఎలాంటి పనిచేశాడో చూస్తే మనం ఏ యుగంలో ఉన్నాం అని అనిపించక మానదు.

(చదవండి: ఒకప్పుడు అది నరకం..ఇప్పుడు నందనవనం!)

అసలు విషయంలోకెళ్లితే... షాహికుమార్.. తమిళనాడుకు చెందినవాడు. కర్ణాటకలోని భూనహళ్లికి చెందిన వ్యవసాయదారుడు శ్రీనివాస్ అనే వ్యక్తికి  ఒక పెళ్లిలో పూజలు చేసే షాహికుమార్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఒకరోజు ఈ షాహికుమార్‌.. శ్రీనివాస్‌ ఇంటికి వచ్చాడు. అయితే శ్రీనివాస్‌ ఇల్లు 75 సంవత్సరాల క్రితం నిర్మించిన పాత ఇల్లు. ఈ మేరకు షాహికుమారు చాలా పాతకాలం నాటి పూర్వకాలం ఇంటిలో గుప్తనిధులు ఉంటాయని, వాటిని బయటకు తీయకపోతే చాలా ఆపదలు ఎదుర్కొంటారని శ్రీనివాస్‌తో చెబుతాడు. ఈ మేరకు షాహికుమార్‌ గుప్తనిధుల తీసే నిమిత్తం శ్రీనివాస్‌ నుంచి అడ్వాన్స్‌గా రూ 20 వేలు కూడా తీసుకున్నాడు. అయితే కోవిడ్‌-19 లాక్‌డౌన్‌లతో పని వాయిదా పడుతూ వచ్చింది. ఆ తర్వాత రెండు నెలలకు శ్రీనివాస్‌ని కలసి పని ప్రారంభిస్తానని చెప్పాడు.

పైగా ఈ గప్త నిధుల నిమిత్తం చేసే పూజల కోసం శ్రీనివాస్‌కుమార్‌ ఇంట్లోని ఒక గదిని ఎన్నుకున్నాడు. అంతేకాదు ఈ నిధి కనపడాలంటే ఒక స్త్రీ తన ముందు నగ్నంగా కూర్చొబెడితే గుప్తనిధి కనపడుతుందని చెబుతాడు. పైగా ఆ స్త్రీ శ్రీనివాస్‌ కుటుంబంలోని అమ్మాయే అయ్యి ఉండాలని పట్టుబడతాడు. దీంతో శ్రీనివాస్‌ ఈ పని నిమిత్తం ఒక దినసరి కూలి మహిళకు రూ.5000 ఇచ్చి ఒప్పించి తీసుకువస్తాడు.

అయితే పూజారి షాహికుమార్‌ పనులు అనుమానస్పదంగా అనిపించి స్థానికులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇస్తారు. దీంతో పోలీసులు ఘటనాస్థలికి వచ్చి పూజారి షాహికుమార్‌ అతని సహాయకుడు మోహన్, తాపీ మేస్త్రీలు లక్ష్మీనరసప్ప, లోకేష్, నాగరాజ్, పార్థసారథిలను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ మేరకు పోలీసులు అక్కడ స్థానకుల చొరవతోనే ఈ దినసరి కూలి మహిళను, ఆమె నాలుగేళ్ల కూతురును రక్షించగలిగామని చెప్పారు. 

(చదవండి:  ప్రపంచంలోనే అత్యంత ప్రీమెచ్యూర్‌ బేబిగా గిన్నిస్‌ రికార్డ్‌)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top