కరోనా: ప్రత్యేక ల్యాబ్‌లను ప్రారంభించిన మోదీ

PM Narendra Modi Lauches Special Corona Test Labs In Delhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోవిడ్‌-19 చికిత్స కోసం ప్రత్యేక ల్యాబ్‌లను సోమవారం ప్రారంభించారు. అనంతరం ప్రధాని మీడియాతో మాట్లాడుతూ... ల్యాబ్‌ల ప్రారంభంతో టెస్టుల సామర్థ్యం మరింత పెరుగుతుందని తెలిపారు. దేశంలో కరోనా బాధితుల రికవరి రేటు బాగా ఉందన్నారు. ప్రతి రోజు 10 లక్షల టెస్టులు చేయడమే లక్ష్యమని, ఇప్పటికే దేశంలో రోజుకు 5 లక్షల టెస్టులు జరుగుతున్నాయని మోదీ పేర్కొన్నారు. (చదవండి: ఏపీ: ఒక్కరోజే 3,234 మంది కరోనా బాధితుల డిశ్చార్జ్‌)

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. వరుసగా గత నాలుగు రోజుల నుంచి భారత్‌లో 45 వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 48,661 కేసులు నమోదు కాగా.. 705 మంది బాధితులు మృత్యువాత పడినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో  దేశంలో మొత్తం కేసుల సంఖ్య 13,85,522కు, మరణాలు 32,063కు చేరుకున్నాయి. (చదవండి: కరోనా పరీక్షలపై ఏపీ సర్కార్‌ కీలక ఆదేశాలు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top