
ఎన్నో దశాబ్దాలుగా ప్రేక్షకులను తన అద్భుత నటనతో వినోదం అందిస్తున్నారని ప్రశంసించారు. అమితాబ్ ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని ప్రార్థించారు.
బాలీవుడ్ మెగాస్టార్, దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ. దేశంలోని గొప్ప నటుల్లో అమితాబ్ ఒకరని కొనియాడారు. ఎన్నో దశాబ్దాలుగా ప్రేక్షకులను తన అద్భుత నటనతో వినోదం అందిస్తున్నారని ప్రశంసించారు. అమితాబ్ ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని ప్రార్థించారు. ఈమేరకు ప్రధాని ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్‌కు స్పందిస్తూ అత్యంత గౌరవనీయులైన మోదీజీకి ధన్యవాదాలు అని తెలిపారు బిగ్‌బీ. మీ ఆశీర్వాదాలు ఎల్లపుడు స్పూర్తినిస్తాయని పేర్కొన్నారు. ఈ మేరకు మోదీ ట్వీట్‌కు హిందీలో రిప్లై ఇచ్చారు.
परम आदरणीय, श्री नरेंद्र मोदी जी, आपकी शुभकामनाओं के लिए मैं आभार प्रकट करता हूँ । आपके आशीर्वाद रूपी शब्द, मेरे लिए सदा प्रेरणा का स्तोत्र रहेंगे । प्रणाम 🙏🙏🙏🚩 https://t.co/Jc9doWdIfF
— Amitabh Bachchan (@SrBachchan) October 11, 2022
మంగళవారం 80వ పుట్టినరోజు జరుపుకుంటున్న బిగ్‌బీ అమితాబ్‌కు దేశ నలుమూల నుంచి శుభాకంక్షలు వెల్లువెత్తాయి. ప్రముఖులు, సినీపరిశ్రమకు చెందినవారు ఆయనకు సామాజిక మాధ్యమాల వేదికగా బర్త్‌డే విషెస్ చెప్పారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఈ జాబితాలో ఉన్నారు.
చదవండి: అశ్రునయనాల మధ్య ములాయం అంత్యక్రియలు