‘ఫ్యామిలీలో మరణం’ అయినా.. పార్టీ గెలుపు కోసం కృషి: మోదీ | Sakshi
Sakshi News home page

‘ఫ్యామిలీలో మరణం’ అయినా.. పార్టీ గెలుపు కోసం కృషి: మోదీ

Published Tue, Dec 5 2023 11:32 AM

PM Modi Praises JP Nadda After Poll Wins - Sakshi

న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అ‍ధ్యక్షుడు జేపీ నడ్డాపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించిన నేపథ్యంలో ఏర్పాటు చేసిన విజయ ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడు రాష్ట్రాల్లో బీజేపీ గెలపులో పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా కీలకంగా వ్యవహరించిన తీరును ప్రధాని కొనియాడారు.

మూడు ముఖ్యమైన రాష్ట్రాల్లో బీజేపీ గెవటం కోసం జేపీ నడ్డా చూపించిన నాయకత్వ లక్షణాలు, నిరంతరం శ్రమ ఫలితాల్లో కనిపించాయని తెలిపారు. ఆయన చేసిన క్షేత్రస్థాయి పరిశీలనలు, వ్యూహాలు పార్టీని ఎన్నికల్లో విజయ తీరాలకు చేర్చిందని మోదీ అభినందించారు.

ఎన్నికల ప్రచార సమయంలో ఆయన కుంటుంబానికి సంబంధిచిన బంధువుల్లో ఒకరు మరణించినా.. ఆ బాధను దిగమింగి మారీ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డారని తెలిపారు. నడ్డా రచించిన ఎన్నికల వ్యూహాలు బీజేపీకి గెలుపును సునాయాసం చేశాయని అన్నారు. బీజేపీ విజయం కోసం నడ్డా.. పూర్తిస్థాయిలో పట్టుదలతో కృషి చేశారని పేర్కొన్నారు.

ఈ విజయ ర్యాలీలో జేపీ నడ్డా కూడా మాట్లాడుతూ.. ‘దేశంలో హామి ఉందంటే.. అది మోదీ హామి మాత్రమే’ అని పేర్కొన్నారు. ప్రధాని మోదీ నాయకత్వలో పని చేయటం తమ అదృష్టమని తెలిపారు. మోదీ ప్రభతో మూడు రాష్ట్రాల్లో విజయం సాధించామని ఆయనకు కృతజ్ఞతలు చెప్పారు. ప్రధాని మోదీ ఎప్పుడు పార్టీని ముందుండి నడిపిస్తారని జేపీ నడ్డా పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement