15 రోజుల పాటు ప్రధాని మోదీ పుట్టినరోజు వేడుకలు | PM Modi 75th Birthday Celebrations And Top Politician Wishes Videos Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

15 రోజుల పాటు ప్రధాని మోదీ పుట్టినరోజు వేడుకలు

Sep 17 2025 9:08 AM | Updated on Sep 17 2025 11:10 AM

PM Modi 75th Birthday Celebrations

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర ఈరోజు తన 75వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. 1950, సెప్టెంబర్ 17న గుజరాత్‌లోని మెహ్సానా జిల్లాలో జన్మించిన మోదీ.. ప్రధాని పదవిని అలంకరించక ముందు 2001 నుండి 2014 వరకు వరుసగా మూడు పర్యాయాలు గుజరాత్‌ ముఖ్యమంత్రిగా  ఉన్నారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ‘సేవా పఖ్వారా’పేరుతో ప్రధాని మోదీ పుట్టినరోజు వేడుకలను దేశవ్యాప్తంగా పక్షం రోజుల పాటు నిర్వహిస్తోంది.


రాజస్థాన్ బీజేపీ ప్రధాని మోదీ 75వ పుట్టినరోజును పురస్కరించుకుని పరిశుభ్రతా కార్యక్రమాలను చేపట్టింది. రాజస్థాన బీజేపీ అధ్యక్షుడు మదన్ రాథోడ్ పార్టీ కార్యకర్తలతో కలిసి జైపూర్‌లోని ఐకానిక్ హవా మహల్‌లో పరిశుభ్రతా కార్యక్రమంలో పాల్గొన్నారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మీ అసాధారణ నాయకత్వంతో దేశంలో గొప్ప లక్ష్యాలను సాధించే సంస్కృతిని పెంపొందించారని ఆమె కొనియాడారు.

మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో ‘స్వస్థ్ నారీ సశక్త్ పరివార్’, ‘8వ రాష్ట్రీయ పోషణ్ మాహ్’ ప్రచారాలను ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ ఈరోజు మధ్యప్రదేశ్‌లో పర్యటించనున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజున ఢిల్లీ అగ్నిమాపక దళం 24 క్విక్ రెస్పాన్స్ వాహనాలను (క్యూఆర్‌వీ) ప్రవేశపెట్టనుంది.

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా ప్రధాని నరేంద్ర మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. భారతీయుల హృదయాలను శాసించే ప్రధాని నరేంద్ర మోదీకి  పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని ఆమె పేర్కొన్నారు.

భారతదేశంలోని రష్యన్ రాయబారి డెనిస్ అలిపోవ్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

ప్రధాని మోదీ 75వ పుట్టినరోజు సందర్భంగా రాజ్‌కోట్ విద్యార్థులు 75 రంగోలీలను రూపొందించారు.

కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ ప్రధాని మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రధాని  నాయకత్వాన్ని అభినందించారు.

సూరత్‌వాసులు ప్రధాని నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజును పురస్కరించుకుని అతిపెద్ద త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.

ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా, అహ్మదాబాద్‌లోని మణినగర్‌లో వేడుకలు జరిగాయి, పూలతో భారతదేశ మ్యాప్‌ను రూపొందించారు.

మోదీ పుట్టినరోజు  సందర్భంగా ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో బీజేపీ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసింది.

ప్రముఖ ఇసుక కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ ఒడిశాలోని పూరి బీచ్ ఒడ్డున ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలియజేశారు.

పీయూష్ గోయల్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రిగా, తరువాత ప్రధానమంత్రిగా దేశానికి సేవలు అందిస్తున్నారని కొనియాడారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement