విశ్వాసం అంటే ఇదేరా !  | Pet Dog Struggling With a Snake In Chennai | Sakshi
Sakshi News home page

విశ్వాసం అంటే ఇదేరా ! 

Oct 30 2021 7:22 AM | Updated on Oct 30 2021 7:24 AM

Pet Dog Struggling With a Snake In Chennai - Sakshi

పాముతో పోరాడుతున్న పెంపుడు కుక్క  

సాక్షి ప్రతినిధి, చెన్నై: యజమాని ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న విషనాగుతో అరగంటకు పైగా పోరాడి తరిమికొట్టి విశ్వాసం చాటుకున్న జాగిలం ఉదంతమిది. కడలూరు జిల్లా చిన్నాంగుపత్తుకు చెందిన ప్రియ రోసి అనే జాగిలాన్ని పెంచుతున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు ప్రియ బజారుకు వెళ్లారు. ఇంట్లోని కుక్క అదేపనిగా అరుస్తూ ఉండడంతో స్థానికులు వెళ్లి చూశారు.

ఇంటి తూము గుండా ఒక విషసర్పం లోనికి వెళుతుండగా రోసి దానికి ఎదురెళ్లి అడ్డుకుంటుండడం చూసి గగుర్పాటుకు గురయ్యారు. పాములు పట్టే సెల్వ అనే యువకుడికి కబురుపెట్టారు. జాగిలాన్ని దాటుకుని వెళ్లలేక తిరుగుముఖం పట్టిన పామును సెల్వ పట్టుకుని  సమీపంలోని అడవిలో వదిలిపెట్టడం చూసిన తరువాత జాగిలం రోసి అరవడం ఆపివేసింది. పామును ఏ మాత్రం కదలనీయకుండా చేస్తూ 30 నిమిషాలకు పైగా పోరాటం ద్వారా శునక జాతి విశ్వాసాన్ని లోకానికి మరోమారు చాటింది. 

చదవండి: (వండలూరు జంతు ప్రదర్శనశాలలో ‘వైరస్‌’ కలకలం..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement