ప్రతీకారం: వామ్మో.. తనను కరిచిన పామును కొరికి చంపేశాడు!

Odisha Man Bites Snake In revenge It Deceased - Sakshi

భువనేశ్వర్‌: పాములు మనుషులను కరవడం సాధరణంగా జరుగుతునే ఉంటాయి. అయితే ఇటీవల కాలంలో మాత్రం మనిషి పామును ‘కరవడం’ వంటి వింత ఘటనలు గురించి వింటున్నాం. ఒడిశా రాష్ట్రంలో ఇటువంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. పాము కాటేసిందిని కోపంతో ఆ పామునే కరిచి చంపాడు ఓ ప్రబుద్దుడు. వివరాలు.. జాజ్‌పూర్ జిల్లాలోని గంభారిపాటియా గ్రామానికి చెందిన కిషోర్ బద్ర (45)అనే గిరిజన రైతు  బుధవారం రాత్రి పొలం పనులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో అతని కాలిని ఏదో కరిచింది.

తన చేతిలో టార్చ్‌లైట్‌ వేసి చూడగా తనను కరిచింది.. విషపూరితమైన సర్పంగా గుర్తించాడు. వెంటనే కోపంతో ప్రతీకారం తీర్చుకునేందకు పామును పట్టి పదే పదే కొరికాడు. దాంతో ఆ పాము వెంటనే ప్రాణాలు వదిలింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. పామును కరిచిన  కిషోర్ బద్రకు ఎటువంటి ప్రమాదం జరగలేదు.  మరణించిన పామును తీసుకుని తన గ్రామానికి వచ్చిన బద్ర..  జరిగిన విషయాన్ని తన భార్యకు చెప్పాడు. అతడి నిర్వాకం ఆ గ్రామంలో  ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top