ఢిల్లీలో నారీ శక్తి వందన సమ్మేళనం | Nari Shakti Vandan Conclave in Delhi 13th April | Sakshi
Sakshi News home page

నారీ శక్తి వందన సమ్మేళనం.. హాజరుకానున్న మోదీ

Apr 12 2026 9:29 PM | Updated on Apr 12 2026 9:38 PM

Nari Shakti Vandan Conclave in Delhi 13th April

(ఫైల్‌ఫోటో)

ఢిల్లీ: వికసిత్‌ భారత్‌ లక్ష్యంలో భాగంగా రేపు(సోమవారం, ఏప్రిల్‌ 13వ తేదీ) ఢిల్లీలో నారీ శక్తి వందన సమ్మేళనం జరుగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరై మహిళలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.   ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీ ప్రసంగం ఉంటుంది. 

వివిధ రంగాలకు చెందిన  ప్రభుత్వ, విద్యా, విజ్ఞాన, క్రీడలు, వ్యాపార, మీడియా, సామాజిక సేవ, సాంస్కృతిక రంగాల మహిళా ప్రతిభావంతులు హాజరవుతారు. వికసిత భారత్ 2047 లక్ష్యానికి మహిళా ఆధారిత అభివృద్ధి కీలకమని ఈ సమ్మేళనం ద్వారా తెలియజేయనున్నారు ప్రధాని మోదీ. పార్లమెంట్‌ నుండి పంచాయతీల వరకు అన్ని స్థాయిల్లో మహిళల భాగస్వామ్యం పెరగాలనేది ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం. 




 

Advertisement
 
Advertisement
Advertisement