మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది దుర్మరణం! | Sakshi
Sakshi News home page

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది దుర్మరణం!

Published Thu, Feb 29 2024 9:13 AM

MP Road Accident in Dindori 14 People Died - Sakshi

మధ్యప్రదేశ్‌లోని దిండోరిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో 14 మంది మృతి  చెందారు. 21 మంది గాయపడినట్లు సమాచారం. షాపురా పోలీస్ స్టేషన్- బిచియా పోలీస్ పోస్ట్ ఏరియా పరిధిలోని బద్జార్ ఘాట్‌లో ఒక పికప్ వాహనం అదుపు తప్పి బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరిగింది.

ప్రమాదంలో గాయపడినవారంతా షాపురా కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. బాధితులంతా డియోరి గ్రామానికి చెందిన వారని చెబుతున్నారు.

ఈ ఘటనపై ఎంపీ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, బాధిత కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని సీఎం కోరుతున్నారు. కాగా మృతుల్లో 9 మంది పురుషులు, ఐదుగురు మహిళలు ఉన్నారు. గాయపడిన 21 మందిలో తొమ్మిది మంది పురుషులు, 12 మంది మహిళలు ఉన్నారు. ఇద్దరు బాధితులను జబల్‌పూర్‌కు ఆసుపత్రికి తరలించారు. అయితే వారిలో ఒకరు మార్గంమధ్యలోనే మృతి చెందారు. 
 

Advertisement
 
Advertisement
 
Advertisement