‘మోదీ జీ.. ఇది మీ కారణంగానే సాధ్యమైంది: బీఆర్‌ఎస్‌ ఎంపీ | MP Parthasaradhi Reddy Writes A Letter To PM Narendra Modi | Sakshi
Sakshi News home page

‘మోదీ జీ.. ఇది మీ కారణంగానే సాధ్యమైంది: బీఆర్‌ఎస్‌ ఎంపీ

Apr 3 2025 5:54 PM | Updated on Apr 3 2025 6:16 PM

MP Parthasaradhi Reddy Writes A Letter To PM Narendra Modi

న్యూఢిల్లీ:  ఫార్మా ఉత్పత్తులపై కొత్తగా అమల్లోకి రాబోతున్న యూఎస్‌ టారిఫ్‌ ల నుంచి మినహాయింపు రావడంపై  హెటిరో డ్రగ్స్ అధినేత, బీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ లేఖ రాశారు. యూఎస్‌ టారిఫ్‌ల నుంచి ఫార్మా ఉత్పత్తులకు  మినహాయింపు రావడానికి ప్రధాని మోదీనే కారణమన్నారు. ‘మోదీ నాయకత్వం వల్లే ఇది సాధ్యమైంది. టారిఫ్‌ మినహాయింపుల వల్ల ఫార్మా ఎగుమతులు పెరుగుతాయి. దీని వల్ల దేశానికి మరింత లాభం చేకూరుతుంది’ అని లేఖలో పేర్కొన్నారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విదేశీ ఉత్పత్తులపై భారీగా సుంకాలు వడ్డించారు. భారతదేశ ఉత్పత్తులపై 26 శాతం టారిఫ్‌ వసూలు చేయనున్నట్లు ప్రకటించారు. అన్ని దేశాల నుంచి దిగుమతి అయ్యే అటోమొబైల్స్‌పై 25 శాతం సుంకం విధిస్తున్నట్లు తేల్చిచెప్పారు. ప్రతీకార సుంకాలు ఈ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు.

ఇదే సమయంలో భారత ప్రధాని మోదీ గురించి ట్రంప్‌ ప్రస్తావించారు. తనకు మోదీ గొప్ప స్నేహితుడని చెప్పుకొచ్చారు ట్రంప్‌,.  అయితే యూఎస్‌ కు ఫార్మా ఎగుమతులు చేసే దేశాల జాబితాలో ఒక కీలక దేశంగా ఉన్న భారత్‌ కు ...  ఇందులో మినహాయింపు ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement