వైరల్‌: పనికి కుదిరిన కోతి.. పాత్రలు తలతల? | Monkey Washing Plates At A Tea Stall Video Goes Viral | Sakshi
Sakshi News home page

Employee Of The Month: పనికి కుదిరిన కోతి.. పాత్రలు తలతల?

Jul 5 2021 5:45 PM | Updated on Jul 5 2021 6:04 PM

Monkey Washing Plates At A Tea Stall Video Goes Viral - Sakshi

కొన్నిసార్లు కోతుల చేష్టలు మనుషులను మించి ఉంటాయి. కోతులు గుంపులుగా ఉండి అల్లరి చేస్తే.. అంతకు మించిన హంగామా మరోటి ఉండదనిసిస్తుంది. కొంటె పనులు చేసినపుడు చాలా మంది కోతి చేష్టలేంటి? అంటూ చమత్కరిస్తుంటారు.  అయితే తాజాగా ఓ కోతి టీ స్టాల్‌లో పాత్రలు శుభ్రం చేస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ వీడియోను ఘంటా అనే యూజర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ‘‘అందరూ కష్టపడాలి’’ అనే క్యాప్షన్‌తో షేర్‌ చేయగా.. 2.5 మిలియన్ల మంది నెటిజన్లు వీక్షించారు. అంతే కాదండోయ్‌ 2 లక్షలకు పైగా లైక్‌ కొట్టి.. వేల మంది కామెంట్‌ చేస్తున్నారు.

ఇక బ్యాక్‌గ్రౌండ్‌లో  “అమ్మీ జాన్ కెహతి థి కి కోయి భీ ధండా చోటా నహి హోతా, ఔర్ ధండే సే బాదా కోయి ధరం నహీ హోటా”. అంటూ వచ్చే డైలాగ్‌ మరింత ఆకర్షణగా నిలుస్తోంది. కోతి పాత్రలు కడిగి తర్వాత మళ్లీ వాసన చూసి చెక్‌ చేసుకోవడంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ వీడియోపై ఓ నెటిజన్‌ స్పందిస్తూ.. ‘‘పనికి కుదిరిన కోతి.. పాత్రలు తలతల?’’ అంటూ కామెంట్‌ చేశారు. ఇక మరో నెటిజన్‌ ‘‘ఎంప్లాయ్ ఆఫ్ ది మంత్.. జీతం ఎంతో చెప్పాలి.’’ అంటూ చమత్కరించాడు. అయితే ఇది ఎక్కడ జరిగిందో తెలియ రాలేదు.. కానీ ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement
 
Advertisement
Advertisement