Mob Damages EVMs In Vijayapura District, Overturns Car Of Official - Sakshi
Sakshi News home page

కర్ణాటక విజయపురలో హైటెన్షన్‌: ఈవీఎంలను పగలకొట్టి.. కారును పల్టీకొట్టించి..

May 10 2023 4:25 PM | Updated on May 10 2023 5:09 PM

Mob damages EVMs in Vijayapura district - Sakshi

పోలీసులను చికతబాది మరీ పోలింగ్‌ సిబ్బంది కారును ఉల్టాపల్టా కింద.. 

బెంగళూరు: కర్ణాటకలో పోలింగ్‌ వేళ.. ఉద్రిక్తకరమైన ఘటన ఒకటి చోటుచేసుకుంది. బుధవారం పోలింగ్‌ కేంద్రం నుంచి తీసుకెళ్తున్న ఈవీఎంలను పగలగొట్టారు గ్రామస్థులు. విజయపుర జిల్లా మసబినళ గ్రామంలో ఇది చోటుచేసుకోగా.. పోలీసు బలగాల మోహరింపుతో పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు తెలుస్తోంది. 

అడ్డొచ్చిన పోలీసులను చితకబాది ఈవీఎంలను లాక్కుని ధ్వంసం చేశారు గ్రామస్తులు. అంతటితో ఆగకుండా ఎన్నికల సిబ్బందిపైనా గ్రామస్తుల్లో కొందరు దాడికి తెగబడ్డారు. ఎన్నికల సిబ్బంది కారును పల్టీకొట్టించి మరీ ధ్వంసం చేశారు. వీవీఎం ప్యాట్‌ మిషన్లను  నుజ్జు నుజ్జు చేసిన గ్రామస్తుల దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. 

ఇదిలా ఉంటే.. బాలెట్‌ యూనిట్లను డ్యామేజ్‌ చేసిన వ్యవహారంపై ఈసీ స్పందించింది. ఈవీఎంలను పగలకొట్టడంతో పాటు ఓ అధికారిపైనా దాడి చేసినందుకుగానూ.. 23 మందిని పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు వెల్లడించింది. కంట్రోల్‌, బాలెట్‌ యూనిట్‌తో పాటు మూడు వీవీప్యాట్‌లు ధ్వంసం చేశారని తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement