
సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్లు ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో సెలబ్రిటీల ‘మనసులోని మాట’లు తాజాగా ఇలా...!
ఎవరికి సోకుతుంది?
నేను నా కారులో ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు కూడా మాస్క్ ధరించమని చెప్పడంలో తర్కం ఏమైనా ఉందా!
– మిషి చౌదరి, న్యాయవాది
ముందుకు పోవట్లేదు
జనాలు కోవిడ్ గురించిన సంపూర్ణ అకడమిక్ పుస్తకాలనే ప్రచురించేస్తు న్నారు; కానీ నేనేమో మూడు వందల ఏళ్ల క్రితం జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా 2006లో ఏదో రాద్దామని వచ్చిన ఆలోచనతో మొదలుపెట్టిన ఒక ప్రాజెక్టులో ఇంకా సగానికి కూడా రాలేదు.
– డానా అగ్‌మాన్, హిస్టారియన్
ఇదే సందర్భం
ప్రధానమంత్రి మోదీ కోవాగ్జిన్ టీకా వేయించుకున్నారు. ఇప్పుడాయన అమెరికాకు ప్రయాణమవుతున్నారు. ఈ నేపథ్యంలో భారత విదేశీ వ్యవహారాల శాఖ, భారత్ బయోటెక్ కంపెనీ తమ పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించి, ఇది కేవలం ప్రధాని మోదీ పర్యటనకు మాత్రమే ఒక మినహాయింపులా కాకుండా, కోవాగ్జిన్ టీకా వేసుకున్న అందరికీ పూర్తి ప్రవేశం ఉండేలా చేయడానికి ఒక ప్రాతిపదికగా మలుచుకోవాలి.
– శుభాంగి శర్మ, సంపాదకురాలు
అమెరికా ప్రయాణం
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆహ్వానం మేరకు నేను అమెరికా వెళ్తున్నాను; ఇరు దేశాల ప్రయోజ నాలతో ముడిపడిన అంశాలపై చర్చనూ, అభిప్రాయాల మార్పిడినీ కొనసాగించడానికి. అలాగే ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తోనూ సమావేశం కానున్నాను; ప్రపంచ సమస్యలపై చర్చించడానికీ, ఇరుదేశాల మధ్య సహకారానికి సంబంధించిన ఆలోచనలను అన్వేషించడానికీ.
– నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
ఐడియా!
నేను నా బాత్‌రూమ్‌లో ఒక క్యాండిల్ వెలిగించాను; ఇప్పుడు అది ‘స్పా’ అయి పోయింది! చాలా డబ్బులు మిగిలాయి.
– తషా కొరీల్, రచయిత్రి
చీరనే కాదంటారా?
చీర కట్టుకోవడం ‘స్మార్ట్ వస్త్రధారణ’ కాదని ఎవరు నిర్ణయిస్తారు? యూఎస్, యూఏఈ, ఇంకా యూకే లోని మంచి రెస్టారెంట్లలోకి కూడా నేను చీర కట్టుకుని వెళ్లాను. ఎవరూ నన్ను ఆపలేదు. కానీ ఇండియా(ఢిల్లీ)లోని ఏదో అకీలా రెస్టారెంట్ మాత్రం ఒక డ్రెస్ కోడ్ నిర్దేశించి, చీర తగినంత ‘స్మార్ట్’ కాదని చెబుతోంది. విపరీత ధోరణి!
– శేఫాలీ వైద్య, జర్నలిస్ట్
కొద్దిమంది వ్యవహారం
పితృస్వామ్యం లాంటి మాటలు ప్రయోగించేవారితో పోల్చితే చాలామంది భారతీయులు – అది ఆడవాళ్లయినా, మగవాళ్లయినా చాలా తక్కువ అవకా శాలు కలిగివున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ మొత్తం సమానత్వ పోరాటమంతా పైనున్న రెండు శాతం వారు ఇంకా పైనున్న ఒక్క శాతం వారితో చేసేదే.
– మను జోసెఫ్, రచయిత