Ministry of Telecom: తప్పుడు సిమ్‌లు 21 లక్షలు! | Ministry of Telecom to take action against 21 lakh SIM cards activated with fake proof of identity | Sakshi
Sakshi News home page

Ministry of Telecom: తప్పుడు సిమ్‌లు 21 లక్షలు!

Mar 21 2024 5:23 AM | Updated on Mar 21 2024 5:23 AM

Ministry of Telecom to take action against 21 lakh SIM cards activated with fake proof of identity - Sakshi

గుర్తించిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్స్‌

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తప్పుడు ధృవీకరణ పత్రాలతో 21 లక్షల సిమ్‌ కార్డులు జారీ అయినట్లు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్స్‌(డీఓటీ) అనుమానం వ్యక్తంచేసింది. రీ–వెరిఫికేషన్‌ చేసి బోగస్‌ సిమ్‌లుగా తేలిన వాటిని వెంటనే రద్దుచేయాలని భారతీ ఎయిర్‌టెల్, ఎంటీఎన్‌ఎల్, బీఎస్‌ఎన్‌ఎల్, రిలయన్స్‌ జియో, వొడాఫోన్‌ టెలికం సంస్థలకు డీఓటీ హెచ్చరికలు జారీచేసింది.

సంచార్‌ సాతీ కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా 114 కోట్ల మొబైల్‌ కనెక్షన్లను డీవోటీకి చెందిన ఆరి్టఫిషియల్‌ ఇంటెలిజెన్స్, డిజిటల్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌(ఏఐ, డీఐయూ) విశ్లేíÙంచింది. దీంతో దేశవ్యాప్తంగా తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో 21 లక్షల సిమ్‌ కార్డులు యాక్టివేట్‌ అయి ఉన్నట్లు డీఓటీ విశ్లేషణలో తేలింది. మనుగడలో లేని, తప్పుడు, ఫోర్జరీ, నకిలీ ధృవీకరణ పత్రాలతో ఈ సిమ్‌కార్డులను సంపాదించి యాక్టివేట్‌ చేసి ఉంటారని ఏఐ, డీఐయూ విశ్లేషణలో వెల్లడైంది.

దేశంలో తొమ్మిది సిమ్‌ కార్డుల కంటే ఎక్కువ తీసుకున్న వారు ఏకంగా 1.92 కోట్ల మంది ఉన్నట్లు ఈ విశ్లేషణలో వెల్లడైంది. 21 లక్షల సిమ్‌ కార్డుల్లో కొన్ని అనుమానాస్పద ఫోన్‌ నంబర్ల జాబితాను విడుదల ఆయా టెలికం కంపెనీలకు డీఓటీ పంపించింది. వాటి ధృవీకరణ పత్రాలను సరిచూసి రీవెరిఫికేషన్‌ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. రీవెరిఫికేషన్‌లో ఆ సిమ్‌లు తప్పుడు పత్రాల ద్వారా తీసుకున్నట్లు గుర్తిస్తే ఆ నంబర్లను తక్షణం రద్దు చేయాలని సూచించింది. ఇప్పటి వరకు 1.8 లక్షల మొబైల్‌ హ్యాండ్‌సెట్‌లను పనిచేయకుండా చేశామని డీఓటీ అధికారులు చెప్పారు. అనుమానాస్పద నంబర్లపై దర్యాప్తును సరీ్వసు ప్రొవైడర్లు వేగవంతం చేయాలని డీవోటీ తుది గడువు విధించింది.   

సైబర్‌ నేరాలకు దుర్వినియోగం!
తప్పుడు పత్రాలతో పొందిన సిమ్‌లను ఆయా వ్యక్తులు సైబర్‌ నేరాలకు వాడుతున్నట్లు డీఓటీ అనుమానం వ్యక్తంచేసింది. ఒక ప్రాంతంలో తీసుకున్న బోగస్‌ సిమ్‌ను సుదూర ప్రాంతాల్లో వాడున్నట్లు గుర్తించారు. తప్పుడు పత్రాలతో సేకరించిన సిమ్‌ల ద్వారా సైబర్‌ నేరాలకు పాల్పడుతూ కోట్లు కొల్లగొట్టే ప్రమాదముంది. సిమ్‌లను సైబర్‌ నేరాలకు వాడుతున్నట్లు తేలితే వాటిని రద్దు చేయడంతో పాటు ఫోన్‌నూ పనికిరాకుండా చేస్తామని హెచ్చరించింది.

Advertisement
 
Advertisement
Advertisement