
భారత్ - పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో.. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్య కార్యదర్శులు, పరిపాలనాధికారులకు లేఖ రాసింది. సివిల్ డిఫెన్స్ రూల్స్‌కు సంబంధించి అత్యవసర అధికారాలు ఉపయోగించి అన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించింది.
ప్రజలు, ఆస్తుల రక్షణకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టడానికి.. శత్రు దాడి సమయంలో కీలకమైన సేవల నిరంతరాయ పనితీరును నిర్ధారించడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందని హోం మంత్రిత్వ శాఖ తమ లేఖలో గుర్తు చేసింది.
1968 నాటి పౌర రక్షణ నియమాలలోని సెక్షన్ 11, రాష్ట్ర ప్రభుత్వాలకు అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను, ఆస్తులను హాని లేదా నష్టం నుండి రక్షించడానికి త్వరిత చర్యలు తీసుకునే అధికారం ఇస్తుంది. అటువంటి సంక్షోభాల సమయంలో విద్యుత్, నీటి సరఫరా, రవాణాతో సహా ముఖ్యమైన సేవలు నిరంతరాయంగా పనిచేస్తాయని కూడా ఇది నిర్ధారిస్తుంది.
As per the communique, Section 11 of the Civil Defence Rules, 1968, can be invoked and necessary Emergency Procurement Powers to the Director Civil Defence of state/UT, may be granted so that efficient implementation of the necessary precautionary measures can be implemented.
— ANI (@ANI) May 9, 2025