రైలులో చెలరేగిన మంటలు.. కాలి బూడిదైన బోగీ! | Massive Fire Engulfs Train Coach at Madhubani Station | Sakshi
Sakshi News home page

రైలులో చెలరేగిన మంటలు.. కాలి బూడిదైన బోగీ!

May 28 2026 12:49 PM | Updated on May 28 2026 12:53 PM

Massive Fire Engulfs Train Coach at Madhubani Station

మధుబని: ఈరోజు (బుధవారం) తెల్లవారుజామున  బిహార్‌లోని మధుబని రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫాం నంబర్ మూడు వద్ద అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అక్కడ నిలిపి ఉంచిన జయనగర్-ఉధ్నా అంత్యోదయ ఎక్స్‌ప్రెస్ రైలు, గురువారం బయలుదేరాల్సి ఉంది. షంటింగ్ ప్రక్రియ సమయంలో అకస్మాత్తుగా ఒక బోగీ నుంచి మంటలు రావడం మొదలైంది. చూస్తుండగానే మంటలు తీవ్రరూపం దాల్చడంతో, ఆ బోగీ పూర్తిగా కాలి బూడిదైంది.

రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. దాదాపు  10 ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని,  గంటసేపు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి. ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే యంత్రాంగం అప్రమత్తమై ప్లాట్‌ఫాం ప్రాంతాన్ని ఖాళీ చేయించి, భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఉన్నతస్థాయి విచారణకు ఆదేశం
సమస్తిపూర్ డివిజన్ డీఆర్ఎం జ్యోతి ప్రకాష్, కమాండెంట్ ఆశిష్ కుమార్ తదితర ఉన్నతాధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. రైలు నిలిపి ఉంచిన సమయంలో మంటలు ఎలా వచ్చాయనే కోణంలో రైల్వే అధికారులు విచారణ ప్రారంభించారు. క్షేత్రస్థాయిలో ఆధారాలను సేకరిస్తున్నామని, సమగ్ర విచారణ నివేదిక తర్వాతే ప్రమాదానికి గల అసలు కారణాలు వెల్లడవుతాయని అధికారులు పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement